అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఒక స్పెషల్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఆ వీడియోలో నరేష్ బైక్ నడుపుతూ ఇంటెన్స్ గా కనిపించారు. బైక్‌ను ఆపి తుపాకీ తీసుకుని గట్టిగా అరుస్తూ ఎవరినో కాల్చాడం ఆసక్తికరంగా వుంది. వీడియో చివర్లో ఏప్రిల్ 14న విడుదల తేదీని ప్రకటించారు. నరేష్ తన తుపాకీని ఒకరిపై గురిపెట్టిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. వీడియో, పోస్టర్ నరేష్ పాత్ర యొక్క వైల్డ్ క్యారెక్టర్ ని తెలియజేస్తున్నాయి.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. కొంతమంది ప్రముఖ నటీనటులు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నాందికి పని చేసిన దాదాపు టెక్నికల్ టీం ‘ఉగ్రం’ కోసం పని చేస్తున్నారు.
తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: అల్లరి నరేష్, మిర్నా
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్
కథ: తూము వెంకట్
డైలాగ్స్: అబ్బూరి రవి
డీవోపీ: సిద్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
పీఆర్వో : వంశీ-శేఖర్
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…