యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్ లీడ్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆలియాభట్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రెయిజింగ్ స్టార్, యష్‌రాజ్ ఫిల్మ్స్ హోమ్ గ్రోన్ టాలెంట్ శార్వరి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వారిద్దరూ స్పై యూనివర్శ్‌లో సూపర్ ఏజెంట్స్ గా కనిపించనున్నారు. ఈ స్పెషల్ ప్రాజెక్టులో వాళ్లిద్దరినీ ఆల్ఫాగర్ల్స్ గా పరిచయం చేయనున్నారు ఆదిత్య చోప్రా.
యష్‌రాజ్‌ఫిల్మ్స్ సంస్థలో ఆలియా, శార్వరి నటిస్తున్న సినిమాకు ‘ఆల్ఫా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆల్ఫా అనే టైటిల్‌కి మగవారు మాత్రమే కాదు, మహిళలూ అర్హులే అని సమాజానికి గట్టిగా చాటి చెప్పాలనే ధ్యేయంతో ఈ టైటిల్‌ని ఖరారు చేశారు ఆదిత్య చోప్రా.
టైటిల్ రివీల్ వీడియాలో ఆలియా చెప్పిన డైలాగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ”గ్రీక్ ఆల్ఫబెట్‌లో మొదటి అక్షరం, మన ప్రోగ్రామ్ మోటో, అన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా వేగం, అన్నిటికన్నా స్థైర్యం… నిశితంగా గమనించండి… ప్రతి నగరం ఒక అడవే. ప్రతి అడవినీ ఏలేది.. అల్ఫా!” అంటూ ఆలియా చెప్పిన డైలాగ్ ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది.
వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్ లీడ్ సినిమా ఆల్ఫాను యాక్షన్ స్పెక్టకల్‌గా చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆదిత్య చోప్రా. ఆల్ఫా సినిమాను శివ్ రవైల్ తెరకెక్కిస్తున్నారు. గతంలో యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ది రైల్వేమెన్ సినిమాతో పేరు తెచ్చుకున్నారు శివ్ రవైల్.
ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్పై యూనివర్శ్ ఐపీగా పేరుంది యష్‌రాజ్‌ఫిల్మ్స్ ఆదిత్య చోప్రాకి. స్పై వెర్స్ చిత్రాలు ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రాలే.
ప్రస్తుతం ఆలియా – శార్వది ఆల్ఫాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఆదిత్య చోప్రా. మరోవైపు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాను కూడా డీల్ చేస్తున్నారు. ఆయన బ్లాక్ బస్టర్ యూనివర్శ్ నుంచి నెక్స్ట్ సినిమాగా పఠాన్2 రానుంది. ఆ వెంటనే టైగర్ వర్సెస్ పఠాన్ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…