35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, RGV ల ‘శివ’

Must Read

తెలుగు సినిమా చరిత్రలో 1989 అక్టోబర్ 5న విడుదలై ఓ సంచలనమ్ సృటించిన చిత్రం ‘శివ’. ఈ చిత్రం విడుదలై 35వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. శివ చిత్రానికి ముందు శివ చిత్రం తరువాత అన్నట్టుగా సినీ రహదారికి టర్నింగ్ మైల్ స్టోన్ గా ట్రెండ్ సెట్ చేసింది శివ మూవీ. అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ ని పోషించారు. మొదటి చిత్రం తోనే సెన్సేషన్ క్రియేట్ చేసారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్,యార్లగడ్డ సురేంద్ర అన్నపూర్ణ స్టూడియోస్ & ఎస్ ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అక్కినేని అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన విలన్ గా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించి, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. పాటలు వేటూరి, సిరివెన్నెల రాసారు. శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో అక్కినేని నాగార్జున హీరోగా శివ టైటిల్ తో 1990 లో పునర్నిర్మించారు. 35వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ చిత్రానికి పనిచేసిన నటి.. నటులకు, టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు రామ్ గోపాల్ వర్మ.

Latest News

Rahasyam Idam Jagat A Unique Story Komal R Bharadwaj

Rahasyam Idam Jagat" is a film blending science fiction and mythological thrillers. From the promotional content of the film,...

More News