అఖిల్ అక్కినేని హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమాను సోమవారం రోజున ‘వారెవా వారెవా..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేవారు. ఈ పాటకు అభిమానులు, మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ తమ వాయిస్‌తో పాటకు ఓ ఎమోషనల్ ఫీల్‌ను తీసుకొచ్చారు.

మ్యూజికల్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను చక్కగా ప్రతిబింబిస్తూ, హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.
శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఇప్పటి వరకు 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసింది. మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేయటానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గానటిస్తోంది.
నటీనటులు:అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సె తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు
సంగీతం: తమన్.ఎస్
Presented by: Annapurna Studios

