అఖిల్ మూవీ ‘ఏజెంట్’ నుంచి ఏందే ఏందే  పాట విడుదల

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌ లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ మళ్ళీ మళ్ళీ పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

 ఈ రోజు ఈ చిత్రం నుంచి ‘ఏందే ఏందే’ పాటని విడుదల చేశారు మేకర్స్. హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుడికారం ఉట్టిపడేట్లు రాసిన పదాలు అద్భుతమమైన సొగసుని తీసుకొచ్చాయి. సంజిత హెగ్డే, పద్మలత, హిప్ హాప్ కలసి ఈ పాటని చాలా శ్రావ్యంగా అలపించారు.

అఖిల్ ఈ పాటలో కూల్ అండ్ స్టైలిష్‌ గా కనిపించారు. అఖిల్, సాక్షి వైద్య ల కెమిస్ట్రీ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. అందమైన ఫారిన్ లొకేల్స్‌లో రూపొందించిన పాట విజువల్ వండర్ లా వుంది.

సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్,  క్యారెక్టర్‌ లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.

 ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలౌతుంది.

 తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి

దర్శకత్వం: సురేందర్ రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

సహ నిర్మాతలు: అజయ్ సుంకర,  దీపా రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి

బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

కథ: వక్కంతం వంశీ

సంగీతం: హిప్ హాప్ తమిళ

డీవోపీ: రసూల్ ఎల్లోర్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago