వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యానర్స్‌పై ఆర్.ఎ.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్. ఈ సినిమా పాత్రికేయుల సమావేశంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా…
హీరో అశోక్ సెల్వన్ మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు నిన్నలా నిన్నలా సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తే నన్నెంతో ఆదరించారు. ఇప్పుడు ఆకాశం సినిమాతో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. ఇదొక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. దీనికి కూడా తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తారని భావిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలు నాకు ఎప్పటికీ కావాలి. తెలుగు ఇండస్ట్రీ మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తాయి. అలాంటి మంచి కథతో వస్తోన్న సినిమానే ఆకాశం. నేను తమిళంలో చేసిన ఓ మై కడవులే సినిమా చూసి మహేష్ వంటి పెద్ద స్టార్ ట్వీట్ చేసినప్పుడు నాకెంతో స్పెషల్‌గా అనిపించింది. అలాగే ఈ సినిమాకు నానిగారు సపోర్ట్ అందించారు. ఇవన్నీ మంచి సినిమాకు మీరు అందిస్తోన్న సపోర్ట్‌ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆకాశం సినిమా దర్శకుడు కార్తీక్, హీరోయిన్స్ రీతూ, ఆపర్ణ, శివాత్మికలతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్. ఈ సినిమా తర్వాత మీరు నన్ను మీలో ఒకడిగా ఆదరిస్తారని భావిస్తున్నాను. టీజర్, ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. రేపు సినిమాను కూడా ఇదే రీతిలో ఆదరిస్తారనుకుంటున్నాను. ఇదొక విజువల్ ట్రీట్‌టా ఉంటుంది. హండ్రెడ్ పర్సెంట్ మీకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు.
దర్శకుడు ఆర్.ఎ.కార్తీక్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ చేయాలనుకున్నాను. అది ఆకాశం సినిమాతో కుదిరింది. లవ్, ఎమోషన్స్ ఉన్న మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. సినిమా చూస్తే మీరు ప్రేమలో పడతారు. మీ సపోర్ట్ మాకు అవసరం. థాంక్యూ’’ అన్నారు.
హీరోయిన్ శివాత్మిక మాట్లాడుతూ ‘‘ఆకాశం వంటి మంచి ఫీల్ గుడ్ మూవీలో అవకాశం ఇచ్చిన సాగర్‌గారు, కార్తీక్‌గారికి ధన్యవాదాలు. రీతూ కలిసి సినిమా చేయటం ఆనందంగా ఉంది. మంచి ఎక్స్‌పీరియెన్స్. చాలా అందమైన సినిమా. అందరం ఎంతో ఇష్టపడి, కష్టపడి సినిమా చేశాం. లవ్ జర్నీ. థియేటర్‌లో సినిమా చూస్తే విజువల్‌గానే కాకుండా ఎమోషనల్‌గానూ మూవీ మీకు నచ్చుతుంది. అశోక్ సెల్వన్, సాగర్, కార్తీక్ సహా అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. మంచి సినిమాను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.
సాగర్ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు తెలుగు సినిమాలు చేశారు. అయితే మేం చెన్నైలో సెటిల్ అయ్యాం. ఇప్పుడిప్పుడే మళ్లీ ఇక్కడ సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా అంతా కార్తీక్ ఎఫర్ట్. తనకే ఈ క్రెడిట్ దక్కుతుంది. తను మంచి డైరెక్టర్. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. నెరేషన్ సమయంలో తను అలాగే సినిమా చేస్తాడా అనిపించింది. కానీ సినిమా చూసిన మా ఎడిటర్ ఫోన్ చేసి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ చేసినట్లు అనిపించలేదన్నారు. తర్వాత నేను సినిమా చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేశాను. రీతూ వర్మ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివాత్మిక కూడా అద్భుతంగా నటించింది. అపర్ణ కొత్త వేరియేషన్ ఉన్న పాత్రలో మెప్పిస్తుంది. మేం సినిమా చేస్తున్న సమయంలో స్క్రిప్ట్ నచ్చడంతో వయాకామ్ మాతో కలిశారు. అశోక్ సెల్వన్ బ్రిలియంట్‌గా యాక్ట్ చేశారు. సినిమా నవంబర్ 4న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
రీతూ వర్మ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కార్తీక్‌కి థాంక్స్. మా నిర్మాతలు మా సాగర్ గారికి థాంక్స్. ఎందుకంటే తను కథను నమ్మి చేసిన సినిమా. అశోక్ సెల్వన్‌తో నిన్నిలా నిన్నిలా తర్వాత కలిసి చేసిన సినిమా. మూడు వేర్వేరు పాత్రల్లో బ్రిలియంట్ పెర్ఫామెన్స్ చేశాడు తను. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అశోక్ నటనకు ఫిదా అవుతారు. అపర్ణ, శివాత్మిక నేచురల్ పెర్ఫామర్స్. గోపీ సుందర్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేమ గురించే కాదు.. జీవితం గురించి కూడా చెబుతుంది. నవంబర్ 4న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…