ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోన్న ‘లాల్ సలామ్’

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. భారీ చిత్రాలతో పాటు డిఫరెంట్ చిత్రాలను రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజినీకాంత్ నటిస్తోన్న సినిమా కావటంతో ‘లాల్ సలామ్’పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదీ కాకుండా ఆయన బాషా చిత్రం తర్వాత ముంబై బ్యాక్ డ్రాప్‌లో చేసిన సినిమా ఇది.

ఇందులో ఆయన మెయినుద్దీన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా స‌ర్దుబాటు చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది ‘లాల్ స‌లామ్‌’ సినిమా ప్రధాన కథాంశంగా రూపొందింది.

ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీీ అందిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నటీనటులు:

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క‌పిల్ దేవ్‌, సెంథిల్, తంబి రామ‌య్య‌, అనంతిక‌, వివేక్ ప్ర‌స‌న్న‌, తంగ దురై త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు రంగస్వామి, ఎడిటింగ్‌: బి.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, ఆర్ట్‌: రాము తంగ‌రాజ్, స్టైలిష్ట్‌: స‌త్య ఎన్‌.జె, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, కిక్కాస్ కాళి, స్టంట్ విక్కీ, స్టోరి: విష్ణు రంగ‌స్వామి ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: శివ‌మ్ సి.క‌బిల‌న్‌, పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

TFJA

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago