ఏప్రిల్ 26, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ కోసం ఏర్పాటు చేయబడ్డ వేదిక పులకించింది. ప్రదర్శనలోని స్పాట్ లైట్ మరింత ప్రకాశవంతంగా మారింది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోసం ఎదురు చూస్తోన్న ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. అక్కడి ప్రారంభమైన శక్తివంతమైన తరంగాలు హైదరాబాద్, యు.ఎస్.ఎలలో ప్రభావాన్ని చూపాయి. ఎన్నడూ లేనివిధంగా అమెరికాలోని న్యూజెర్సీలో మే 4న సీజన్ 3కి సంబంధించిన ఆడిషన్స్ జరిగాయి. అలాగే మే 5న హైదరాబాద్‌లో ఆడిషన్స్ జరిగాయి. వీటికి అత్యద్భుతమైన స్పందన వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండియన్ ఐడల్ 2కు వచ్చిన అపూర్వమైన స్పందనను ఆధారంగా చేసుకుని మూడో సీజన్‌ను మరింత ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ మూడో సీజన్ ప్రామాణికంగా మరింత గొప్పగా ఉంటుందని ఆహా ప్రేక్షకులకు వాగ్దానం చేస్తోంది. అందుకు ఉదాహరణ రీసెంట్‌గా జరిగిన ఆడిషన్స్. 5000 మంది ఔత్సాహిక గాయనీగాయకులు ఇందులో పోటీ పడ్డారు. ఫైనలిస్ట్స్‌గా నిలిచే టాప్ 12 కోసం వారు అత్యుత్తమమైన ప్రతిభను చూపారు.
సంగీతంలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్, గీతా మాధురి, కార్తీక్ ఈ సీజన్ ఆడిషన్స్‌కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సీజన్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే తెలుగు సంగీతాభిమానుల్లో, ఔత్సాహిక గాయనీ గాయకుల్లో ఉన్న అసాధారణ నైపుణ్యానికి నిదర్శనంగా తెలుస్తోంది. ఎస్.ఎస్.తమన్, గీతా మాధురి, కార్తీక్ మార్గదర్శకత్వం ఔత్సాహిక గాయనీగాయకుల్లో చక్కటి ప్రతిభను బయటకు తీసుకొచ్చి చక్కటి ప్రదర్శన చేసేలా చేశాయి
సంగీత ప్రపంచానికి తమలోని ప్రతిభను ఆవిష్కరించటానికి, వారి కలలను సాకారం చేసుకోవటానికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ రూపంలో చక్కటి వేదిక దొరికింది. గాయనీగాయకుల్లో ఉన్న అసాధారణమైన ప్రతిభను వెలికి తీయటానికి ఇండియన్ ఐడల్ చక్కటి వేదికగా మారిదనంటంలో సందేహం లేదు. ఇంతటి వేదికను కలిగించటం అనేది ఆహా వారి నిబద్ధతను తెలియజేస్తోంది.
సంగీతంలో ఒక గొప్ప నైపుణ్యాన్ని ప్రేక్షకులకు అందించటమే కాకుండా తిరుగులేని వినోదాన్ని అందించటానికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 సన్నద్ధమవుతోంది.
అందులో భాగంగా ఆడిషన్స్‌కు సంబంధించిన తేదీలు వెల్లడి కావటంతో ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకునే వారితో పాటు సంగీత స్వర సాగరంలో మునిగిపోవటానికి ఉవ్విల్లూరే అందరిలోనూ ఉత్సాహం నెలకొంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కోసం మెగా ఆడిషన్స్ మొదటిసారి USAలో ప్రారంభం కానుండటం విశేషం. మే 4న న్యూజెర్సీలో TV9 USA స్టూడియోస్,399 హూస్ లేన్ 2nd ఫ్లోర్ పిస్కాటవే.. అలాగే మే 11న డల్లాస్‌లోని కాకతీయ లాంజ్ 4440 హెచ్.డబ్ల్యువై 121 టీవెసిల్, USA టెక్సాస్ విల్,లూయిస్ విల్లే #5లలో ఆడిషన్స్ జరగనున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్‌కు సంగీత ప్రేమికులు, ప్రేక్షకుల నుంచే కాకుండా ఔత్సాహిక గాయకుల నుంచి చాలా గొప్ప స్పందన వచ్చింది.టెలివిజన్ రంగంలో ఈ కార్యక్రమం సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసింది. దీంతో మూడో సీజన్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. దీన్ని అందుకునేలా ఉంటుందని వాగ్దానం చేస్తోంది ఆహా. అందుకు కారణం ఏకంగా పదివేల మంది ఔత్సాహిక గాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో నుంచి 12 మంది మాత్రమే ఫైనల్ రౌండ్‌కు చేరుకుంటారు.
సంగీత దిగ్గజాలైన ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి నేతృత్వంలో గొప్ప న్యాయ నిర్ణేతల బృందం దీనికి మార్గనిర్దేశకం చేస్తోంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 వచ్చిన స్పందన మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అసాధారణ సంగీత ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తీక్ వంటి వారి అమూల్యమైన మార్గదర్శకత్వం, నిర్మాణాత్మకమైన సద్విమర్శలు, అలాగే పోటీదారులను ఆరోగ్యకరమైన వాతావరణంతో ప్రోత్సహించడం అనేది ఔత్సాహిక గాయకులను గొప్పగా తీర్చిదిద్దడంలో, గొప్ప నైపుణ్యాలను వెలికి తీయటంలో కీలక పాత్ర పోషించాయి.
ఇప్పుడు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 అదే ఉత్సాహంతో సరికొత్త ప్రయాణాన్ని ఉల్లాసకరంగా ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రేక్షకులకు అసాధారణమైన ప్రతిభను వేదిక ప్రదర్శించటమే కాకుండా, సంగీతాభిమానులకు సమానమైన వినోదాన్ని అందించటంలో ఆహా తిరుగులేని నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. మన హైదరాబాద్‌లో మెగా ఆడిషన్‌లు మే 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్నాయి. ఔత్సాహిక గాయకులు తమ గాత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి గౌరవనీయమైన టైటిల్ కోసం పోటీ చేయటాని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది ఆహా.
ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్యేగాలకు గురైంది అన్న ఇతివృత్తంతో "తల్లి మనసు" చిత్రాన్ని…
The highly anticipated film Thandel, starring Yuva Samrat Naga Chaitanya and directed by Chandoo Mondeti,…
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను…
Bekkam Venu Gopal, the renowned producer behind youth-centric hits like Hushaaru, Cinema Choopistha Mava, Prema…
రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ పతాకంపై ఏఐ ఎంటర్ టైన్ మెంట్స్ కలయికలో నిర్మించిన చిత్రం "ఆదిపర్వం".…
The much-anticipated film 'Adiparvam' is all set for a grand theatrical release worldwide on November…