ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ‘అగధ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ .. ‘‘ఫిల్మ్ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి. నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశాను. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘అగధ’ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా సోదరి సమానురాలైన విశాలాక్షి గారికి, డా. రాజు గారు, సుబ్బరాజు, ఇంకో మిత్రుడికి థాంక్స్. మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. టెక్నీషియన్ల పనితనం, ఆర్టిస్టుల వర్క్ ఎలా ఉండబోతోందో టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది. టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. మహాదేవిగా కామాక్షి డెడికేషన్, సిన్సియారిటీకి హ్యాట్సాఫ్. ఈ ప్రాజెక్టులో ‘పొలిమేర’ ఫేమ్ అనిల్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. శ్రవణ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఈ మూవీతో శ్రవణ్ వేరే రేంజ్‌కి వెళ్తాడు. ఉల్కా అద్భుతమైన నటి. మంజుల గారి మనవరాలు, వనిత గారి కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు. మంజుల గారి లెగసీని జోవిక కంటిన్యూ చేస్తారు. ఎడిటర్ జునైద్, కెమెరామెన్ నాని, చైతన్య, రాజీవ్, విక్కీ, రాజేష్ ఇలా అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. ‘అగధ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా అన్న ఎం.ఎస్. రాజు గారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన రాజు గారికి, సుబ్బరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మూవీ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా సినిమాని అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘అగధ’ లాంటి ఓ అద్భుతమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజు గారికి థాంక్స్. ‘పొలిమేర’ పోస్టర్ బాగుందని రాజు గారు నాతో చెప్పారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నన్ను పిలిచినప్పుడు ఎంతో సంతోషించాను. మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజు గారికి థాంక్స్. ఈ చిత్రం గురించి మున్ముందు ఇంకా వింటూనే ఉంటారు. కొన్ని సినిమాలు మాత్రమే మనతో నిత్యం ఉండిపోతాయి. ‘అగధ’ అలాంటి ఓ సినిమానే అవుతుంది. మహాదేవి పాత్ర ఎప్పటికీ నాతోనే, నాలోనే ఉండిపోతుంది. అదే ఫీలింగ్‌ను ఆడియెన్స్‌ను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు.
శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘డర్టీ హరి’తొ నన్ను ఎం.ఎస్.రాజు గారు తెరకు పరిచయం చేశారు. మళ్లీ ఆయనతోనే ‘అగధ’ చేయడం ఆనందంగా ఉంది. ఆ సినిమాకి, ఈ సినిమాకి ఎంతో తేడా ఉంటుంది. రాజు గారితో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాజు గారికి, విశాలాక్షి గారికి థాంక్స్’ అని అన్నారు.
ఉల్కా గుప్తా మాట్లాడుతూ .. ‘‘అగధ’లో నాకు అవకాశం ఇచ్చిన రాజు గారికి, విశాలాక్షి గారికి థాంక్స్. ఆరేళ్ల వయసు నుంచే యాక్టింగ్‌లోకి వచ్చాను. ఇలాంటి ఓ చిత్రంలో, ఇంత మంచి పాత్ర వస్తుందని నేను ఊహించలేదు. ఇది నాకు గొప్ప అవకాశం. కామాక్షి, శ్రవణ్ ఇలా అందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను. మా ‘అగధ’ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘అగధ’తో నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం.ఎస్. రాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజుల గారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా, అందులో నా నటన అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఇప్పటికీ నన్ను ‘దేవి’ సినిమాతోనే గుర్తు పడతారు. ఈ ‘అగధ’ సినిమాతో జోవికాని రాజు గారు ఇంట్రడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది. ఓ పర్ఫార్మర్‌గా జోవికాని తెరకు పరిచయం చేయబోతోన్నారు. ఈ ‘అగధ’ చిత్రం ‘దేవి’ కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ బాగుంది. నిర్మాతగా ఎం.ఎస్. రాజు గారు ఎన్నో హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగా ఇప్పుడు ‘అగధ’తో మరోసారి హిట్టు కొట్టబోతోన్నారు. పోస్టర్, టీజర్ నాకు చాలా నచ్చాయి. ఈ ‘అగధ’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 రాంబాబు మాట్లాడుతూ .. ‘ఎం.ఎస్. రాజు అంటే ఓ బ్రాండ్. ‘దేవి’ స్థాయిలో ‘అగధ’ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అంకిత మాట్లాడుతూ .. ‘‘అగధ’ టీజర్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘డర్టీ హరి’, ‘అగధ’లో అవకాశం ఇచ్చిన రాజు గారికి థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు : కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు
సాంకేతిక బృందం:
రచయిత మరియు దర్శకుడు: ఎం. ఎస్. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్
సంగీత దర్శకుడు: రాకేష్ వెంకటాపురం
సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
అదనపు స్క్రీన్ ప్లే: చైతన్య వేగి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ వి ఎన్ సుబ్బరాజు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…