Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని మూడో పాటను విడుదల చేసిన హీరో అడివి శేష్

Must Read

ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.

ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరపరిచిన రెండు రొమాంటిక్ మెలోడీ పాటలు విడుదలై ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాటను యాక్షన్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా విడుదల చేశారు చిత్ర యూనిట్.

గూఢచారి 2 మరియు డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉన్నా అడివి శేష్, దర్శకుడు బాల గారి చిరకాల పరిచయం వలన అన్నపూర్ణ 7 ఎకరాల ప్రాంగణంలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ లో క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన లిరికల్ పాటను వీక్షించి విడుదల చేశారు.

అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ “క్యూట్ గా స్వీట్ గా పాట చాలా స్వీట్ గా ఉంది, సాహిత్యం చాలా బాగుంది అని కొనియాడారు. చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ “ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ, క్యూట్ గా స్వీట్ గా అనే అందమైన పాటను విడుదల చేసిన అడివి శేష్ గారికి నా కృతజ్ఞతలు. అడివి శేష్ తన మొదటి చిత్రం అమెరికా లో విడుదల చేయడానికి నన్ను సంప్రదించారు. తనకు మంచి టాలెంట్ ఉంది అని అప్పుడే గమనించాను. మా హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. మా చిత్రంలోని ప్రతి పాట చాలా బాగుంటుంది. మంచి పాటలు స్వరపరిచిన కళ్యాణి మాలిక్ గారికి కృతజ్ఞతలు. ఈ క్యూట్ గా స్వీట్ గా పాటకు కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ అందించగా బాహుబలి ఫేమ్ దీపు తన గాత్రంతో ప్రాణం పోశారు.

త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేసి, చిత్రాన్ని ఈ సమ్మర్ లో విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు

సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)

Cute Gaa Sweetu Gaa (Lyrical) | Honeymoon Express | Hebah P, Chaitanya Rao | Kalyani Malik | Bala R


చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్

నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు

సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని

Latest News

దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి.. జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి.. ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025 ఈవెంట్‌లో సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్

సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ది ఫాస్ట్ & క్యూరియస్ - ఆటో ఎక్స్పో 2025 లో పాల్గొన్నారు. ఈ...

More News