“ఆదిపురుష్” టీజర్ 3డి మీడియా స్పెషల్ ప్రీమియర్స్ కి మీడియాలో అనూహ్య స్పందన.

రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది.

ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు.

దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ” ఆదిపురుష్ టీజర్ కోసం ఫాన్స్ లాగే నేనూ చాలా ఆతృతగా ఎదురు చుసాను. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది ఇదే విషయాన్నీ మా టీం తో చెప్పా కానీ వాళ్ళు నాతో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పారు నేను ఒక్కటే చెప్తున్నాను బాహుబలి సినిమాకి కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ అసలు బొమ్మ చూసాకే దాని రేంజ్ అర్ధమవుతుంది ఆ తరువాత టాక్ అదే వెళుతుంది.తనాజీ మూవీ చూసేవరకి ఓం రౌత్ ఎవరో కూడా నాకు తెలీదు కానీ ఆ సినిమా చూసాక అతనికి ఫ్యాన్ అయిపోయాను. ప్రభాస్ ఒక పెద్ద స్టార్. ఈ సినిమా జనవరి 12 న పెద్ద విజయం సాధిస్తుంది.” అన్నారు.”

నిర్మాత భూషణ్ మాట్లాడుతూ, ” మీ రెస్పాన్స్ కి చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఇష్టంతో మీ అందరికీ నచ్చేలా చిత్రీకరించాం. ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారు. మీ అందరి ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను” అన్నారు.

నిర్మాత రాజేష్ నాయర్ మాట్లాడుతూ, ” జై శ్రీరాం, అదొక్కటే మంత్రం ఇక. ఓం, ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్ల కోసమే చేసారు. భక్తితో చేసిన ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం.” అన్నారు.

అయితే ఆధునాతన సాంకేతికత తో 3డి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రూపొందిన ఈ చిత్ర టీజర్ ని అభిమానుల కోసం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో 60-70 థియేటర్లలో ప్రదర్శించనున్నారు .

కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తుండగా యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంలో వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago