“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన వన్ ఆఫ్ ది హీరోగా నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మరో హీరో విశాల్ రాజ్ పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ, మొయినాబాద్ లొకేషన్స్ లో జరిగే ఈ రెండో షెడ్యూల్ లో గౌతమ్ అనే యాక్టర్ తో పాటు జ్యోతి పూర్వజ్ కూడా జాయిన్ కాబోతున్నారు.
నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్ తదితరులు.
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరతన్
వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.
నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.
రచన దర్శకత్వం – పూర్వాజ్
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…