యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘ముఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్. ఆర్ట్స్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ దర్శకత్వం వహించారు.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 21న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అర్జున్ ఇంటెన్స్ లుక్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ థ్రిల్లింగ్ సన్నివేశాలతో అంచనాలను పెంచింది.
ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అభిరామి, రామ్‌కుమార్, జి.కె. రెడ్డి, పి.ఎల్. తేనప్పన్, లోగు, వేల రామమూర్తి, తంగదురై, ప్రాంక్‌స్టర్ రాహుల్, ఓ.ఎ.కె. సుందర్ తదితరులు నటించారు.
శరవణన్ అభిమన్యు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఆశివాగన్ సంగీతం అందిస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్. అరుణ్ శంకర్ ఆర్ట్ డైరెక్టర్,
ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…