హాజరైన సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ మొగులపల్లి ఉపేంద్ర, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ…సాహసోపేతమైన చిన్నారుల కథాంశం..: దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ ప్రతిసారీ కమర్షియల్ సినిమాలే కాకుండా చిన్న పిల్లల ఆలోచనా విధానం పైన ప్రభావం చూపించే మంచి సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ మొగులపల్లి ఉపేంద్ర గుప్త తెలిపారు. ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ వేదికగా గురువారం సాహసోపేతమైన చిన్నారుల ఇతివత్తంతో రూపొందించిన ‘అచీవర్ సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్య్రమానికి సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ మొగులపల్లి ఉపేంద్ర గుప్తతో పాటు ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ పాల్గొని ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఉపేంద్ర గుప్తా మాట్లాడుతూ ., చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు రావాలని, తెలుగు సినిమా వేదిక పైన కూడా ఈ ట్రెండ్ కొనసాగాలని అన్నారు.దర్శకత్వమే కాకుండా నిర్మాత గానూ, ఎడిటర్ గానూ విభిన్న నైపుణ్యాలతో రాణిస్తున్న దర్శకుడు తల్లాడ సాయికృష్ణ నేటి తరం సినిమా ఔత్సాహికులకు ఆదర్శమని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు.అతి తక్కవ సమయంలో సినిమా తీయడమే కాకుండా సినిమా నిర్మాణ వ్యయాన్ని అదుపు చేయడం తన ప్రత్యేక శైలి అని అభినందించారు. సుకుమార్ వంటి దర్శకుల స్ధాయికి చేరే టాలెంట్ తనకుందని పేర్కొన్నారు.
అచీవర్ సినిమా దర్శకుడు తల్లాడ సాయి క్రిష్ణ మాట్లాడుతూ…మొబైల్ గేమ్స్ అడే ప్రస్తుత తరం చిన్నారుల్లా కాకుండా వారికున్న తెలివితేటలతో ముగ్గురు చిన్నారులు తీవ్రవాదులను ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ సినిమా తీశామని అన్నారు. సినిమాలో నటించిన కపిల్, చాణక్య, విశ్వ తేజ ల చదువులకు ఇబ్బంది కాకుండా దసరా సెలవుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకొని, నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా అచీవర్ సినిమా ను విడుదల చేయనున్నామని తెలిపారు.విభిన్న కథతో జాతీయ స్థాయి అవార్డు అందుకునే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, విద్యార్థి దశ నుంచే చాకచక్యమైన ఆలోచనా విధానం ను పెంపొందించేలా ఈ సినిమా ఉంటుందన్నారు.
అనంతరం ఈ అచీవర్ సినిమాలోని అద్భుతమైన పాటను డాక్టర్ సీ కే రెడ్డి ఆవిష్కరించారు. తక్కువ టైంలో మంచి సినిమాటిక్ విలువలతో సినిమా నిర్మించడంలో తల్లాడ సాయి సుప్రసిద్ధులని ఆయన అన్నారు.మాస్టర్ రాయల కపిల్ మాట్లాడుతూ నేను ఈ సినిమా లో హీరో గా చేసాను, నాకు చాన్స్ ఇచ్చిన మా టీం అందరికి ధన్యవాదాలు అలానే మా సినిమా ట్రైలర్ మీ అందరికి నచ్చుతుంది అని భావిస్తున్నాను.మరొక నటుడు మాస్టర్ చాణిక్య మాట్లాడుతూ ఫస్ట్ టైమ్ యాక్ట్ చేసాను, మా పేరెంట్స్ సపోర్ట్, మా టీం సపోర్ట్ తో ఈ సినిమాలో యాక్ట్ చేసాను.ఈ కార్యక్రమంలో వివేకానంద విక్రాంత్, మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ ఉప్పల, సింగర్ సుమంత్ బొర్ర,లిరిసిస్ట్ హానుమాద్రి శ్రీకాంత్, నటి అను, స్వప్న చౌదరి ,విజయ్, సాయి మణికంఠ, పవన్ లునాటిక్ , మాస్టర్ రాయల కపిల్, మాస్టర్ సారా చాణిక్య లతో పాటు అచీవర్ చిత్ర తారాగణం పాల్గొన్నారు.
తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా…
Mass Maharaaj of South Indian Cinema, Ravi Teja has been a symbol of infectious energy…
విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జై హనుమాన్ కోసం…
Visionary director Prasanth Varma, fresh off the success of the true Pan-India blockbuster HanuMan, is…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్టైన్మెంట్స్,…
అక్టోబర్ 30, 2024: తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, సినిమాల్లో అద్భుతమైన నటనతో అలరిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార…