ఆయ్ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నిఖిల్

నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల ముఖ్య అతిథులుగా విచ్చేసి బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆయ్ సినిమాను ఆగస్ట్ 15న సాయంత్రం రిలీజ్ చేయబోతోన్నాం. మా ఈవెంట్‌కు వచ్చిన నిఖిల్, శ్రీలీల గారికి థాంక్స్. కొడితే పది మంది కింద పడే కథ కాదు కదా? అని అడిగాను. ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎవరి కష్టం వారు పడాలి అని ఎన్టీఆర్ గారు అన్నారట. అలా నితిన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నయన్ సారికి ఈ చిత్రంలో చాలా బాగా నటించింది. వినోద్ గారు చాలా ఏళ్ల తరువాత మంచి కారెక్టర్ చేశారు. కసిరాజు, అంకిత్ ఇద్దరూ అద్భుతంగా నటించారు. వీళ్లలో ఇంత మంచి నటులున్నారా? అని అనుకుంటారు. అంజితో నాకు బన్నీ వాస్ కథ చెప్పించాడు. కథ బాగానే చెప్పాడు.. కానీ ఎలా తీస్తాడో అని అనుకున్నా. నాది గ్యారెంటీ అని బన్నీ వాస్ అన్నాడు. కానీ పది కోట్ల గ్యారెంటీ ఎవరు ఇస్తారు. అంజి చాలా అద్భుతంగా తీశాడు. నేను ఈ సినిమాను చూశాను. ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఓ ఎమోషన్‌తో బయటకు వస్తారు’ అని అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘స్వయంభు షూటింగ్ వల్ల బయటకు రాలేకపోతోన్నాను. సోషల్ మీడియాలో ఆయ్ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డు మీదే ఫుడ్ తింటూ నితిన్ గారు ప్రమోట్ చేశారు. ఓ మంచి సినిమా, యంగ్ టీం ముందుకు వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలని ఇక్కడకు వచ్చాను. జాతి రత్నాలు, మ్యాడ్, బేబీ మేకర్లు ఇక్కడకు వచ్చారు. చిన్న చిత్రం కూడా వంద కోట్లు కొల్లగొట్టొచ్చని నిరూపించారు. ఆయ్ కూడా ఆ కోవలోనే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ తరువాత నితిన్‌కు మళ్లీ మంచి చిత్రం పడింది. కసిరాజు, అంకిత్, సారికల మ్యాజిక్ చూడాలని కోరుకుంటున్నాను. ఆగస్ట్ 15న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

శ్రీలీల మాట్లాడుతూ.. ‘నితిన్ గారి మ్యాడ్ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆయ్ చిత్రంలో హ్యూమర్ చాలా ఉందని అర్థం అవుతోంది. నాకు ఇలాంటి చిత్రాలే చాలా ఇష్టం. అందుకే అనుదీప్ గారెతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు అని అడుగుతుంటాను. గోదావరి ప్రాంతం, ఆ యాస అంటే నాకు చాలా ఇష్టం. ఆగస్ట్ 15న అందరూ అన్ని చిత్రాలను చూడండి’ అని అన్నారు.

నార్నే నితిన్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన సాయి రాజేష్ గారు, ఎస్ కే ఎన్ గారికి, కళ్యాణ్ శంకర్ గారికి, అనుదీప్ అన్నకి, నిఖిల్ గారికి, శ్రీలీల గారికి థాంక్స్. మా దర్శకుడు మాతో అద్భుతంగా పని చేయించుకున్నారు. నిర్మాతలు బన్నీ వాస్ గారు, విద్యా గారు మా సినిమాను ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. సెట్‌లో ఉండి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఈ కథను ఓకే చేశాక.. అల్లు అరవింద్ గారు నాకు ఫోన్ చేశారు. నాతో చాలా సేపు మాట్లాడారు. డీఓపీ సమీర్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. అజయ్, రామ్ మిర్యాల మంచి పాటలు ఇచ్చారు. భాను మాస్టర్ మంచి స్టెప్పులు కంపోజ్ చేశారు. ఆగస్ట్ 15న మా చిత్రం రాబోతోంది. మంచి సందేశాన్ని ఇచ్చాం. కులాలు, మతాలను మించిందే స్నేహం. దాని గురించి చెప్పామ’ ని అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘నార్నే నితిన్ గారు లేకుంటే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చేది కాదు. ఇది ముగ్గురు కుర్రోళ్లు కథ. ఈ కథ నచ్చి ఆయన ముందుకు వచ్చారు. నితిన్ మా అందరితో ఎంతో చక్కగా కలిసిపోయారు. పిఠాపురంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. మా హీరోని ఆ విషయం అడగడం మర్చిపోయా. ఒకసారి ఎన్టీఆర్ గారిని అడిగి చెప్పండని అన్నాను. ఆ నిర్మాతకి, ఆ సినిమాకు ఉపయోగపడుతుందంటే ఏం చేసినా పర్లేదు అని ఆయన అన్నారు. అలా సినిమా వరకే విషయాన్ని చూడటం అంటే మామూలు విషయం కాదు. పాలకొల్లు నుంచి సాదాసీదా యానిమేటర్ వచ్చి.. ఇప్పుడు ఇలా ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో సినిమా చేశానంటే ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాననిపిస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానిని. ఎంత అదృష్టం ఉంటే.. ఆయన పొలిటికల్ జర్నీలో నేను భాగం అయి ఉంటాను. పబ్లిసిటీ తక్కువగా ఉందని అంతా అన్నారు. కానీ నాకు అవసరం వచ్చిన ప్రతీ సారి ఆయన నా వెంట ఉంటాడు. నేను కష్టంలో ఉన్నానంటే నా అమ్మ, నా స్నేహితుడు బన్నీలకు తెలుస్తుంది.. వాళ్లే సాయం చేసేందుకు ముందుకు వస్తారు. నేను అడగక ముందే నా సినిమా ట్రైలర్‌ను బన్నీ గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 20 ఏళ్ల క్రితం నేను ఒక తప్పు చేస్తే..నా కోసం అల్లు అరవింద్ గారికి ఎదురు నిలబడి నాకు అండగా బన్నీ నిలబడ్డారు. బన్నీ లేకపోయి ఉంటే బన్నీ వాస్ అనే వాడు ఉండేవాడు కాదు. షూటింగ్ ఉన్నా కూడా మా ఈవెంట్‌కు వచ్చిన శ్రీలీల గారికి థాంక్స్. ఇది నా బ్యానర్, నా సినిమా నేను కచ్చితంగా వస్తాను అని నిఖిల్ భయ్యా అన్నారు. రియాజ్, భాను గార్లు ఈ కథను నా వద్దకు తీసుకొచ్చారు. జాతి రత్నాలు చూసి చాలా కుళ్లుకున్న. ఈ కథను విన్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. జాతి రత్నాలు, మ్యాడ్ లేకపోయి ఉంటే ఈ కథను ఇలా తీసే వాళ్లం కాదు. మా చిత్రం ఆగస్ట్ 15న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. ‘స్వయంభు షూటింగ్‌లో బిజీగా ఉన్నా కూడా మా కోసం వచ్చిన నిఖిల్ గారికి, శివుడు చేసిన లీల.. శ్రీలీల గారికి థాంక్స్. ధృవ తార నార్నే నితిన్ గారికి, కసిరెడ్డ గారికి, అంకిత్ కొయ్య గారికి ఆల్ ది బెస్ట్. నా స్నేహితుడు బన్నీ వాస్, భాను, రియాజ్ గారికి ఆల్ ది బెస్ట్. మా అందరినీ నడిపించే మా గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారికి థాంక్స్. నేను ఈ మూవీ ఫస్ట్ కాపీ చూశాను. ఫస్ట్ హాఫ్‌లో చాలా నవ్వుకుంటాం.. సెకండాఫ్‌లో కథ అద్భుతంగా సాగుతుంది. చివరి పది నిమిషాలు ఎంతో ఫీల్ ఉంటుంది. ఫ్రెండ్ షిప్ గురించి గొప్పగా చెప్పే సినిమా అవుతుంది’ అని అన్నారు.

సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘ఇది మా సినిమాను. నాకు ఇష్టమైన వాళ్లందరూ కలిసి చేసిన చిత్రమిది. పక్కింటి అబ్బాయిలా నార్నే నితిన్ అద్భుతంగా నటించాడు. అంజి ఈ చిత్రాన్ని బాగా తీశారు. గీతా ఆర్ట్స్, GA2 అంటే పెద్ద సినిమాలే అని అనుకునేవారు. కానీ కొత్త వారికి ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తున్న అల్లు అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి, విద్య గారికి థాంక్స్. ఆగస్ట్ 15న రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

దర్శకుడు అంజి కే మణిపుత్ర మాట్లాడుతూ.. ‘నా కథను బన్నీ వాస్ దగ్గరకు తీసుకెళ్లిన నా ఫ్రెండ్స్ నవీన్, రియాజ్‌‌లకు థాంక్స్. బన్నీ వాస్ గారు లేకపోయి ఉంటే మాత్రం మా సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. నార్నే నితిన్ గారు ఈ పాత్రలో నటించినట్టుగా అనిపించదు. ఆ పాత్రలోనే ఉండి బిహేవ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కసిరెడ్డి గారి టైమింగ్ ఇందులో చాలా కొత్తగా ఉంటుంది. అంకిత్ అద్భుతంగా నటించాడు. సమీర్ మాకు అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. నా టెక్నికల్ టీంకు థాంక్స్. మాకు పైసా వసూల్.. మీకు (ఆడియెన్స్) నవ్వుల వసూల్.. రెండు గంటల పాటలు అన్నీ మర్చిపోయి నవ్వుతూనే ఉంటారు. కంటి తడితో థియేటర్ నుంచి బయటకు వస్తారు. మ్యాడ్, జాతిరత్నాలు రేంజ్‌లో ఎంటర్టైన్ చేసి, ఎమోషనల్‌గా బయటకు వెళ్తారు’ అని అన్నారు.

అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘ఇలాంటి చిత్రంలో ఇంత మంచి పాత్ర రావడం మామూలు విషయం కాదు. కామెడీని పండించాల్సిన బాధ్యత మా మీద ఎక్కువ ఉంటుందని బన్నీ వాస్ గారు ముహూర్తం రోజే అన్నారు. నాకు ఈ యాసలో అంజి అన్న ఎక్కువగా హెల్ప్ చేశారు. నేను ఇందులో ఏం చేసినా అది ఆయన చేసినట్టే. ఆగస్ట్ 15న కచ్చితంగా అందరినీ నవ్విస్తాం. సినిమా మాట్లాడిన తరువాత సక్సెస్ మీట్‌లో ఎక్కువ మాట్లాడతాను’ అని అన్నారు.

నయన్ సారిక మాట్లాడుతూ.. ‘బన్నీ వాస్ గారి సహకారం లేకపోయి ఉంటే.. ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చేది కాదు. మాకు ఎప్పుడు అవసరం ఉన్నా ఆయన మాకు అండగా నిలిచారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. నన్ను నమ్మి నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన అంజి గారికి థాంక్స్. నితిన్ గారెతో పని చేయడం ఆనందంగా ఉంది. అంకిత్ చాలా మంచి వ్యక్తి. కసిరెడ్డి గారు చాలా డెడికేటెడ్ పర్సన్. ఆయ్ టీంతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 15న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

సహ నిర్మాత భాను మాట్లాడుతూ.. ‘ఆయ్ అనేది ఎక్స్‌ప్రెషన్ కాదు.. ఎమోషన్. టైటిల్ చూస్తూనే సక్సెస్ కొట్టాడని అనిపించింది. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సహ నిర్మాత రియాజ్ మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన గెస్టులకు థాంక్స్. ఇది నాకు రెండో చిత్రం. నాకు ఈ సినిమాను ఇచ్చిన విద్యా, వాస్ గార్లకు థాంక్స్. అందరినీ నవ్వించేలా ఈ చిత్రాన్ని అంజి తీశారు. నితిన్, సారిక, అంకిత్, కసిరెడ్డి గార్లు అద్భుతంగా నటించారు. అందరూ మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

11 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago