దుల్క‌ర్ స‌ల్మాన్ పాన్ ఇండియా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’

* భారీ పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తున్న పవన్ సాధినేని

మలయాళ సూపర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్..తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో త‌న‌దైన ముద్రవేశారీ అగ్ర కథానాయ‌కుడు. తెలుగులోనూ మ‌హాన‌టి, సీతారామం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఈయ‌న అల‌రించిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ క‌ల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్ర‌లోనూ దుల్క‌ర్ అల‌రించారు. ఇప్పుడు ఈయ‌న క‌థానాయ‌కుడిగా తెలుగులో ఓ సినిమా ప్రారంభమైంది.

తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని సంపాదించుకున్నారు దుల్క‌ర్ స‌ల్మాన్ ఇప్పుడు యూనిక్ సినిమాలు, విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల‌తో ద‌ర్శ‌కుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప‌వ‌న్ సాధినేనితో చేతులు క‌లిపారు. దుల్కర్ స‌ల్మాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.  

‘ఆకాశంలో ఒక తార’గా తెరకెక్కబోతున్న ఈ మూవీ పోస్ట‌ర్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఓ రైతులా క‌నిపిస్తున్నారు. అదే పోస్ట‌ర్‌లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండ‌టాన్ని చూడొచ్చు. దుల్క‌ర్ మ‌రో డిఫ‌రెంట్ రోల్‌తో అల‌రించ‌బోతున్నార‌నే విష‌యం పోస్ట‌ర్ ద్వారా స్ప‌ష్ట‌మైంది. ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. హృద‌యాన్ని హ‌త్తుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా మెప్పించ‌నుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ‌లైన గీతా ఆర్ట్స్‌, స్వ‌ప్న సినిమాల‌తో పాటు లైట్ బాక్స్ మీడియా బ్యాన‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సందీప్ గుణ్ణం, ర‌మ్య గుణ్ణం ఈ మూవీని నిర్మిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఈ మూవీ నిర్మాణంలో భాగ‌మ‌వుతుండ‌టం అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది.

త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేకర్స్ తెలియ‌జేశారు. అభిమానులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు, సినీ ప్రేక్ష‌కులు ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ కోసం ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు. రాబోయే ఈ వివ‌రాల‌ను అంచ‌నాల‌ను మ‌రింత పెంచేలా ఉంటాయ‌న‌టంలో సందేహం లేదు. ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కోసం టాప్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేయ‌నున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో అల‌రించ‌నుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago