వెరీ ట్యాలెంటెడ్ ఆది సాయికుమార్ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్న క్రైమ్-యాక్షన్ థ్రిల్లర్ ‘SI యుగంధర్’. రాకేందు మౌళి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్.
ఈ రోజు పూజా కార్యక్రమంతో ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇచ్చారు. సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు.
ఈ సందర్భంగా మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఆది సాయికుమార్ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
ఈ చిత్రానికి ప్రణవ్ గిరిధరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవోపీ గా రవీంద్రనాథ్.టి పని చేస్తున్నారు. SJ శివ కిరణ్ ఎడిటర్, రాజేష్ లంక ఫైట్ మాస్టర్.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. ముందుగా రామోజీరావు గారికి హ్యాపీ బర్త్ డే. వి మిస్ యు సార్. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన బర్త్డే రోజున ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథని ఈటీవీ విన్ ఓన్ చేసుకోవడమే ఫస్ట్ సక్సెస్. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. చాలా మంచి యంగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నారు. మంచి సినిమా చేస్తే ఆదరించడానికిఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి మంచి ప్రయత్నం ఇది. మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తే విజయం దానంతట అదే వస్తుంది. ప్రేమకావాలి సినిమాతో ఆది జర్నీ మొదలైంది. 2025 ఆదికి ఒక మంచి కొత్త సంవత్సరం అవ్వాలని మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ఒక యంగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నాం. చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని నమ్మకం ఉంది. కంటెంట్ నమ్మి సినిమాని చేస్తున్నాం. ప్రదీప్ గారు చాలా పాషనెట్ ప్రొడ్యూసర్. ఈటీవీ వారికి థాంక్యూ. ఈ సినిమా కథ నచ్చి వాళ్ళు రైట్స్ తీసుకుని సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. 18 నుంచి షూట్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం. లాంచింగ్ ఈవెంట్ కి వచ్చిన సందీప్ కి థాంక్యూ. తను ఎప్పుడు తోడుగా ఉంటాడు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
హీరోయిన్ మేఘలేఖ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఆదితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు
డైరెక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ.. చాలా యూనిక్ థ్రిల్లర్ ఇది. చాలా బాగుంటుంది. ఆది గారికి ఈ కథ నచ్చింది వెంటనే మనం చేస్తున్నామని చెప్పారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతలకి థాంక్యూ సో మచ్. టీంలో అందరికీ థాంక్ యూ సో మచ్.
రాకేందు మౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాను. నేను కొన్నాళ్లుగా కేవలం రచన పైన దృష్టి పెట్టాను. బాగా నచ్చితే గాని ఏ పాత్రని చెయ్యట్లేదు. ఈ కథ నాకు చాలా నచ్చింది. అందుకే ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాను. ఆది గారితో కలిసి ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా ఈ కథని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుంది . ఇలాంటి మంచి కథతో ముందుకు వస్తున్న నిర్మాతలకి కంగ్రాజులేషన్స్. చాలా మంచి థ్రిల్లర్ ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఈ కథ విన్నాము. చాలా యూనిక్ థ్రిల్లర్ అవుతుందని పించింది. అందుకే ఈ సినిమా రైట్స్ తీసుకున్నాము. డైరెక్టర్ స్క్రిప్ట్ ని చాలా అద్భుతంగా రాశారు. ఇదొక యూనిక్ థ్రిల్లర్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు
నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ.. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఈ కథ వినగానే మా మైండ్ లోకి ఆది గారు వచ్చారు. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకి థాంక్యూ సో మచ్. ఈటీవీ వారి సపోర్ట్ కు థాంక్ యూ’ అన్నారు.
నటీనటులు- ఆది సాయి కుమార్, మేఘలేఖ, రాకేందు మౌళి, లావణ్య సాహుకార
నిర్మాత – ప్రదీప్ జూలూరు
దర్శకత్వం – యశ్వంత్
ప్రొడక్షన్ డిజైనర్ – భవిష్య శ్రీ పాకలపాటి
సంగీతం – ప్రణవ్ గిరిధరన్
ఎడిటర్ – SJ శివ కిరణ్
డీవోపీ – రవీంద్రనాథ్.టి
ఫైట్ మాస్టర్ – రాజేష్ లంక
పీఆర్వో: వంశీ శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…