సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘శంబాల’తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ‘శంబాల’ లాంటి మరో వినూత్నమైన కథాంశంతో వీరంతా కలిసి ఓ ప్రయోగం చేయబోతోన్నారు. యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు ఆదితో మరో సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు.
‘శంబాల’ తరువాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాని నిర్మించాలని వీరంతా కలిసి కథాన్వేషణలో పడ్డారు. ఇక అద్భుతమైన కథ తోడవ్వడంతో వీరంతా కలిసి ముందుకు వచ్చారు. ఎమోషన్స్‌తో పాటుగా ఈ సారి హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారు. భయం, ఉత్కంఠ, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్‌తో భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు టీం సిద్దమైంది.
ఈ క్రమంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, ఆకులు, కనిపిస్తున్న పాత కాలం నాటి స్టాంప్ ఇవన్నీ చూస్తుంటే ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్‌తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ కథకి మ్యూజిక్ ప్రాణం అని, సౌండింగ్‌తోనే సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించాలని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ చరణ్ పాకాలని మ్యూజిక్ డైరెక్టర్‌గా మళ్లీ తీసుకున్నారు. ఆయన వినూత్నంగా, కొత్తగా సౌండ్-డిజైన్ పద్ధతులతో ప్రయోగాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. బీజీఎంతో ఉద్రిక్తతను పెంచుతూ, భావోద్వేగాలను రేకెత్తిస్తూ, నిశ్శబ్ద క్షణాలలో కూడా ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తామని టీం చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: ఆది సాయికుమార్
సాంకేతిక సిబ్బంది:
సమర్పణ : యుగంధర్ ముని
నిర్మాతలు: మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నబిమోజు
బ్యానర్ : షైనింగ్ పిక్చర్స్
రచన & దర్శకత్వం : బృందా రవీందర్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్వో : సాయి సతీష్
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…
బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…
▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…