‘గుమ్మడి నర్సయ్య’ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పాట విడుదల

బయోపిక్ సినిమాలు అనేవి ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. ఉన్నది ఉన్నట్టుగా తీశారా? ఏమైనా అదనంగా చూపిస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు చూపిస్తారా? అనే ఆలోచనలతో జనాలు ఆ బయోపిక్ సినిమాలను చూస్తుంటారు. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రజల కోసం ప్రజల కొరకే నా జీవితం అంటూ ముందుకు సాగిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు.

ఈ మేరకు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలె మాట్లాడుతూ.. ‘ఈరోజు శ్రీ గుమ్మడి నర్సయ్య గారి పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశాం. ప్రేక్షక మహాశయులు అందరూ చూసి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బయోపిక్ కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా శ్రద్దగా, నిదానంగా సినిమాను తీస్తున్నాం. ఇకపై సినిమాకు సంబంధించిన అప్డేట్లను రెగ్యులర్‌గా ఇస్తామ’ని తెలిపారు.

చరణ్ అర్జున్ అందించిన బాణీ, పాడిన తీరు పాటను వినసొంపుగా మార్చింది. గుమ్మడి నర్సయ్య వ్యక్తిత్వం, మంచితనం, గొప్పదనం తెలిసేలా రాసిన పాట శ్రోతలను కదిలించేలా ఉంది. ఈ పాటతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా ఉంది. ఈ పాట త్వరలోనే అందరి నోట వినిపించేలా కనిపిస్తోంది.

సాంకేతిక బృందం
బ్యానర్‌ : డార్క్ టు లైట్ క్రియేటర్స్
కథ, కథనం, దర్శకత్వం : పరమేశ్వర్ హివ్రాలే
సంగీతం : చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ : అఖిల్ వల్లూరి
ఎడిటింగ్‌ : సత్య గిడుతూరి

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago