పురుష: నుంచి చాటు చాటు సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ట్యూన్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘పురుష:’. పక్కా ఫ్యామిలీ కథతో వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో ‘పురుష:’ సినిమా రాబోతోంది. వీరు వులవల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించగా.. రీసెంట్ గా వదిలిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషనల్ కంటెంట్ వదులుతూ తమ మూవీపై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా పురుష: నుంచి చాటు చాటు అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్ లోని కస్తూర్బా ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో స్టూడెంట్స్ నడుమ ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్రవణ్ భరద్వాజ్ బాణీలు కట్టారు. చాటు చాటు అంటూ ఆకట్టుకునే మెలోడీ ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాట ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. న్యాచురల్ షూటింగ్ లొకేషన్స్, ట్యూన్ కి తగ్గట్టుగా ఇచ్చిన మ్యూజిక్ తో ఈ సాంగ్ కలర్‌ఫుల్‌గా అనిపిస్తోంది. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ గా మారింది.

పోస్టర్లతోనే చిత్రంపై మంచి బజ్‌ను క్రియేట్ చేసి అంచనాల్ని పెంచిన చిత్రయూనిట్.. తాజాగా వదిలిన పాటతో క్లాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశారు. ఈ సినిమాకు ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్‌గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. చిత్రంలో వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తారని టీం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ ప్రకటించనున్నారు.

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago