“ఏ మాస్టర్ పీస్” మూవీ లుక్

“శుక్ర”, “మాటరాని మౌనమిది” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న సుకు పూర్వాజ్. కమర్షియల్ గా రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ తాజాగా తన మూడో సినిమా “ఏ మాస్టర్ పీస్” కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు.

మంగళవారం ఈ సినిమా హీరో సూవర్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సారి దర్శకుడు ఈ సినిమా ను హాలీవుడ్ రేంజ్ లో సరికొత్త కంటెంట్, ప్రెజంటేషన్ తో రూపొందనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

తమ సూపర్ హీరో ఎలా ఉండబోతున్నాడో తను ఎలా చూపించబోతున్నాడో ఒక్క పోస్టర్ తో చెప్పాడు దర్శకుడు. పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్ హీరోను మన తెలుగు ప్రేక్షకుల కు కూడ పరిచయం చేస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రికరించబోతున్నాం అంటూ తెలియజేశారు దర్శకులు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకొని ఈ జనవరి 26 నుండి ఫిబ్రవరి 10 వరకు అరకు లో మొదటి షెడ్యూల్, ఫిబ్రవరి 18 నుండి మార్చి 30 వరకు రెండవ షెడ్యూల్ చివరగా కులుమనాలి లో ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 10 వ తేదీతో షూటింగ్ పూర్తి చేయనున్నట్లు నిర్మాత తెలియజేశారు

అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ ఆషురెడ్డి, స్నేహా గుప్త తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు

TFJA

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago