క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది. ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మన ఎడ్యుకేషన్ సిస్టం వల్ల యువత ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాలు తోడేస్తున్నాం. చాలా దేశాల్లో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టం లేదు. కొన్ని దేశాల్లో పిల్లలకు ప్రకృతి తోనే ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్  తల్లిదండ్రులకు పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. తన సిస్టం లో ఖచ్చితమైన మార్పు రావాలి లేకపోతే పిల్లలు ఇంకా నలిగిపోతారు. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి. 

నా చిత్రం ఒక స్టూడెంట్ కొన్నాం నుంచి ఉంటుంది. స్టూడెంట్స్ పడే బాధలు ఎలా ఉంటాయో చుపించాము. ఈ రోజుల్లో మనకి పలానా దాని గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్ ని అడిగితే చెప్పేస్తుంది మరి ఇంకా చదువుని భట్టి పెట్టాల్సిన అవసరం ఏంటి, క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది. ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకేక్కిన్చాము. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు చదువుతో పాటు తన మీద తనకు విశ్వాసం కలిగించాలి కానీ ర్యాంకులు కాదు అనే అంశాన్ని ఈ చిత్రంలో చెప్పాము. మనోజ్ నందన్, చక్రవర్తి, మనీషా మరియు సోనీ రెడ్డి ముఖ్య పాత్రలు చేశారు. ఈ నాలుగు పాత్రలో యూత్ ప్రేక్షకులు తమని తాము చూసుకుంటారు. అందరూ చాలా బాగా చేశారు. మేము కొంత మంది టీచర్ కి స్టూడెంట్ కి మా చిత్రాన్ని చుపించాము, అందరూ సినిమా చాలా బాగుంది అని తెలిపారు. చాలా కాలేజెస్ సినిమా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 28న విడుదల అవుతుంది. 

ఈ సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్‌కి ప్రతి స్టూడెంట్‌ కనెక్ట్‌ అవుతాడు. తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌ చూడాల్సిన చిత్రం ఇది. ఈ సినిమా కోసం కొందరు స్టూడెంట్స్‌తో మాట్లాడటం జరిగింది. మన విద్యావ్యవస్థలోని అంశాలను సీరియస్‌గా చూపిస్తే అంతగా నచ్చకపోవచ్చు. అందుకే అవే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం.చదలవాడ శ్రీనివాస రావు గారితో మరో సినిమా ప్లాన్ లో ఉంది. ప్రస్తుతానికి ట్రాన్స్ జెండర్ వాళ్ళ మీద ఒక సినిమా చేస్తున్న. ప్రస్తుతానికి స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాము” అని తెలిపారు. 

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్

బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్

నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా,  వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు

కెమెరా మాన్  & ఎడిటింగ్ : సాబు జేమ్స్

సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.  

కలరింగ్ అమల్

వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ

పి ఆర్ ఓ : పాల్ పవన్

సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు

దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి

Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

7 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago