’35-చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. హీరో రానా దగ్గుబాటి

నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన ఫీల్ గుడ్, హోల్సమ్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, హోల్సమ్ ఎంటర్ టైన్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్యూటీఫుల్ బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం థాంక్స్ మీట్ ని నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో మూవీ ప్రజెంటర్ రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు’ సక్సెస్ చాలా తృప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాలపై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. తనతో వర్క్ చేయడం హానర్ గా వుంది. సురేష్ ప్రొడక్షన్ పిట్టగోడ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది. మీడియా కి థాంక్ యూ. ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్టార్స్ నేనెప్పుడూ చూడలేదు. చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు నందు వలనే ఇది సాధ్యమైయింది. తనలోని ప్యూర్ ఎనర్జీ ఈ సినిమాలో కనిపించింది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. ఈ సక్సెస్ జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే వుంటాం’ అన్నారు

హీరోయిన్ నివేద థామస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకి, అందరికీ థాంక్ యూ. మేము చాలా థియేటర్స్ ని విజిట్ చేశాం. అన్నిచోట్ల సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతోంది. నిన్న ఓ సింగిల్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి, చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్ లో సినిమా ప్లే చేసిన గొప్ప అనుభూతిని ఇచ్చింది. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆడియన్స్ అందరికీ థాంక్. ఈ సక్సెస్ ఇక్కడ నుంచి మొదలైయింది. మేము పర్శనల్ గా వచ్చి ఆడియన్స్ కి థాంక్స్ చెబుతాం. అందరికీ థాంక్ యూ’ అన్నారు

హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి ’35-చిన్న కథ కాదు’ తో ప్రూవ్ అయ్యింది. థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా వుంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా వుంది. థాంక్ యూ ఆడియన్స్. సురేష్ ప్రొడక్షన్, రానా గారు సినిమాని మరో స్థాయిలో పెట్టారు. యాక్టర్ గా నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. నా ఫ్యామిలీ చాలా ఎమోషనల్ అయ్యింది. నివేద, నందు, సృజన్, సిద్ధార్థ్ అందరికీ థాంక్ యూ. సినిమాకి మీ సపోర్ట్ ఇలానే వుండాలి’ అన్నారు.

డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని మాట్లాడుతూ… సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆడియన్స్ కి థాంక్ యూ. నా రైటింగ్ డిపార్ట్ మెంట్, మ్యూజిక్ వివేక్ సాగర్, డీవోపీ నికేత్, నివేద, విశ్వదేవ్ ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మీ అందరి సపోర్ట్ ఇలానే వుండాలి’ అన్నారు.

నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి మాట్లాడుతూ.. ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కి రావడం, సినిమాని అనుభూతి చెందడం చూస్తుంటే మా మనసు నిండిపోయింది. ఆడియన్స్ కి థాంక్ యూ. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. నేషనల్ అవార్డ్స్ రావాలని ఆడియన్స్ థియేటర్స్ లో కోరుకుంటున్నారు. వారు కోరుకున్నది నెరవేరుతుందనే నమ్మకం వుంది’ అన్నారు

నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ.. ముందుగా మీడియాకి కృతజ్ఞతలు. మీడియా ఇచ్చిన రివ్యూలు, సపోర్ట్ ట్రెమండస్. ఇంత యునానిమస్ గా సినిమాకి అద్భుతంగా రివ్యూస్ రావడం ఆనందంగా వుంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ కి ధన్యవాదాలు. సినిమాని చూసిన ఆడియన్స్ మరో పదిమందికి చెప్పి ఇంత మంచి సినిమాని అందరూ చూసే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Tfja Team

Share
Published by
Tfja Team

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

4 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

4 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago