విద్యకు మద్దతుగా 30 ఈశా బ్రహ్మచారులు

విద్య కోసం పరుగు: హైదరాబాద్‌ NMDC మారథాన్‌లో ఈశా విద్యాకు మద్దతుగా 30 ఈశా బ్రహ్మచారులు ఇంకా వందల మంది వాలంటీర్లు పాల్గొన్నారు

ఈశా విద్య పై అవగాహన ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 30 మంది ఈశా బ్రహ్మచారులు ఇంకా వందల మంది మద్దతుదారులు ఆగస్టు 27న హైదరాబాద్‌లో NMDC మారథాన్‌లో పాల్గొన్నారు.

ఈశా ఫౌండేషన్ యొక్క సామాజిక అభివృద్ధి విభాగమైన ఈశా ఔట్రీచ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశా విద్యా పాఠశాలలు ఉన్నత విలువలతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా, ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు అందుబాటులో ఉండేలా అందజేస్తున్నాయి. 2006లో ప్రారంభమైనప్పటి నుండి, 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈశా విద్యా పాఠశాలల్లో చదువుకున్నారు.

వీరిలో 60% కంటే ఎక్కువ మంది విద్యార్థులు వారి కుటుంబంలో బడికి వెళ్తున్న మొదటి తరం వారు – స్కాలర్‌షిప్‌ల ద్వారా మద్దతు పొందుతున్నారు. మిగిలిన వారు తక్కువ ఫీసులు చెల్లిస్తారు.

పాఠశాలలలో మౌలిక వసతులతో విశాలమైన, బాగా వెలుతురు ఉన్న తరగతి గదులు ఇంకా గ్రామీణ వాతావరణంలో అరుదైనప్పటికీ పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి.

విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థులకు పోషకాహార సమతుల్యమైన మధ్యాహ్న భోజనం అందించబడుతుంది- అవసరమైన విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది, క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటారు.

పిల్లలు క్రీడలు ఇంకా రోజువారీ యోగా అభ్యాసాలలో చురుకుగా పాల్గొంటారు. బహుళ స్థాయిలలో అభ్యాసాన్ని ఉత్తేజపరిచేందుకు ఇంటరాక్టివ్, చర్చ-ఆధారిత తరగతులు ఇంకా కార్యాచరణ-ఆధారిత అభ్యాసంతో ప్రత్యేకమైన పద్దతిని ఈ పాఠశాలలు అనుసరిస్తాయి. ప్రింట్, ఆడియో, వీడియో, కంప్యూటర్ మెటీరియల్స్ ఇంకా డిజిటల్ క్లాస్‌రూమ్‌ల రూపంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు అవసరమైన ప్రాపంచిక అవగాహన ఇంకా నైపుణ్యాలను పొందేలా చూస్తాయి.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago