హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన బి. శివప్రసాద్, శ్రీ పద్మిని సినిమాస్ ‘రారాజా’ టీజర్

సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం రా రాజా. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ స్వీయా నిర్మాణ దర్శకత్వం వహించారు. తాజాగా హీరో అల్లరి నరేష్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.

నిమిషన్నర నిడివి గల టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్యారెక్టర్ ని చూపించకుండా, ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేసిన ఈ ట్రైలర్ హారర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టెర్రిఫిక్ అనిపించింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడి కాన్సెప్ట్, టేకింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మొత్తనికి టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది.

టీజర్ లాంచ్ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై శివప్రసాద్ దర్శకత్వం వహించిన రారాజా సినిమా టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది .డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో నేను చాల ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే దీనిలో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి ఫేస్ లు కనిపించకపోవడం. అదే విషయం డైరెక్టర్ ని అడిగితే చూస్తున్నంత సేపు ఏ ఆడియన్ కూడా ఎంగేజ్ మిస్ అవ్వడు, వింటున్నంత సేపు మీరు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అని చెప్పారు. A.I జనరేషన్ లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు..ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ..సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

బ్యానర్: శ్రీ పద్మిని సినిమాస్
తారాగణం : సుగి విజయ్, మౌనిక మగులూరి & ఇతరులు
నిర్మాత & దర్శకుడు: బి. శివప్రసాద్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ఉప్పు మారుతి
డీవోపీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
యాక్షన్: నందు మాస్టర్
పీఆర్వో : తేజస్వి సజ్జా
డిజిటల్: రెయిన్బో మీడియా

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

4 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

4 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

4 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

4 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

4 days ago