చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గారూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా టీజర్ ను తాజాగా ప్రముఖ దర్శకుడు బాబి విడుదల చేశారు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విశెస్ తెలిపారు.ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే…
విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించారు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది.తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం తెలిపారు.
నటీ నటులు – ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు
సాంకేతిక వర్గం – ,
సినిమాటోగ్రఫీ ః జిశేఖర్,
మ్యూజిక్: అనీష్ సోలోమాన్,
పిఆర్ఒ ః జియస్ కె మీడియా,
నిర్మాత ః అజయ్ శ్రీనివాస్
దర్శకుడు ః శివశంకర్ దేవ్
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…