60 ఇయర్స్ సక్సెస్ ఫుల్ లెగసీ గల సురేష్ ప్రొడక్షన్స్, 2 ఇయర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత వారి కొత్త చిత్రం క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్‌తో పాటు ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీలో నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రైటర్, డైరెక్టర్.
ఈ మూవీకి “35 – చిన్న కథ కాదు” అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ప్లజెంట్ గా డిజైన్ చేసిన పోస్టర్ ద్వారా మేకర్స్ టైటిల్ ని రివిల్ చేశారు. గుడి మెట్లపై కూర్చున్న ఫ్యామిలీని ప్రజెంట్ చేస్తూ క్యారికేచర్‌గా దీన్ని రూపొందించారు. థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా క్లీన్ ఎంటర్ టైన్ మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
పెళ్లి చూపులు, సమ్మోహనం, అంటే సుందరానికీ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఆకాశం నీ హద్దు రా, అంటే సుందరానికి, సర్ఫీరా, కుబేర తదితర చిత్రాలకు గ్రేట్ విజువల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న నికేత్ బొమ్మి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. విజువల్ అప్పీల్ ని యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు నిర్వహిస్తున్నారు. టి సి ప్రసన్న ఎడిటర్.
“35-చిన్న కథ కాదు” మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
నటీనటులు : నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న
డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్…
Director Poorvaj, who has been captivating audiences with films like Shukra, Matarani Maunamidi, and A…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు…
Renowned producer Allu Aravind visited actor Sri Tej, who is currently receiving treatment at KIMS…
Dharma and Aishwarya Sharma are playing the lead roles in the movie Drinker Sai, with…
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ…