టాలీవుడ్

‘మనమే’ సోల్‌ఫుల్ టైటిల్ ట్రాక్ విడుదల

శర్వానంద్, కృతి శెట్టి, హేషమ్ అబ్దుల్ వహాబ్, శ్రీరామ్ ఆదిత్య, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘మనమే’ సోల్‌ఫుల్ టైటిల్ ట్రాక్ విడుదల

తన చార్ట్‌బస్టర్ ఫామ్‌ను కొనసాగిస్తూ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరో సూపర్ హిట్ ఆల్బమ్‌ను అందించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డైనమిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘మనమే’ చిత్రం బ్యూటిఫుల్ ట్రాక్‌లతో అలరిస్తోంది. మొదటి పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రెండవ సింగిల్-మనమేని విడుదల చేశారు.

హేషామ్ అబ్దువల్ వహాబ్ స్కోర్ చేసిన టైటిల్ ట్రాక్ ఫుల్ లైఫ్, వైబ్రెంట్ గా ఉంది. పాటలోని ఎమోషన్, కంపోజిషన్, లిరిక్స్, విజువల్స్ అద్భుతమైన అనుభూతి ఇస్తోంది. లీడ్ పెయిర్- శర్వానంద్, కృతి శెట్టి ఇంతకుముందు గొడవ పడే వారు ఇప్పుడు మంచి అనుబంధంకు వచ్చారు. ఇది కొత్త ప్రారంభం. ప్రతి క్షణం వారికి కొత్త అనుభవం. 

శర్వానంద్, కృతి శెట్టి చక్కని కెమిస్ట్రీని పంచుకున్నారు. ప్రేమ ప్రయాణంతో పాటు, ఈ పాట విక్రమ్ ఆదిత్య పోషించిన పిల్లవాడితో వారి బంధాన్ని కూడా చూపిస్తుంది.

ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యం కృష్ణకాంత్ రాశారు, కార్తీక్, గీతా మాధురి గానం ఈ పాటకు అదనపు ఆకర్షణను జోడించింది. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేశారు. శర్వానంద్ వేసిన మాప్ స్టెప్ అదిరిపోయింది. మనసుని హత్తుకునే ఈ టైటిల్ ట్రాక్ అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ పొజిషన్ లో నిలిచింది. 

విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్లు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.

‘మనమే’ జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య

సాంకేతిక సిబ్బంది:

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ

అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా

డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ

సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్

డీవోపీ: విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS

ఎడిటర్: ప్రవీణ్ పూడి

ఆర్ట్: జానీ షేక్

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

15 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago