మత్స్యకారుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే సినిమా “రేవు”

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర వివరాలు తెలిపారు.

నిర్మాణ పర్యవేక్షకులు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ – ముందుగా మా మిత్రుడు పర్వతనేని రాంబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. నేను గుంటూరులో ఉండగా ఒక వ్యక్తి రేవు సినిమాకు సంబంధించిన కొంత ఫుటేజ్ చూపించాడు. పుటేజ్ ఆసక్తికరంగా అనిపించింది. నేను హైదరాబాద్ వచ్చాక మా మిత్రుడు పర్వతనేని రాంబాబుతో రేవు మూవీ గురించి మాట్లాడాను. రాంబాబు తన మిత్రుడు, ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారితో మాట్లాడారు. మా మీద నమ్మకంతో డాక్టర్ మురళీ గింజుపల్లి గారు మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. ఆయన యూఎస్ నుంచి వచ్చిన తర్వాత రేవు సినిమా ఫస్ట్ కాపీ చూపించాం. డాక్టర్ మురళీ గింజుపల్లి గారు హ్యాపీగా ఫీలయ్యారు. సముద్రతీర ప్రాంతంలో చేపలు పట్టడమే జీవనాధారంగా బతికే మత్స్యకారుల జీవితాల్లోని సంఘర్షణ చూపించే చిత్రమిది. చాలా సహజంగా సినిమా సాగుతుంది, మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టుల నేచురల్ పర్ ఫార్మెన్స్ చేశారు. అజయ్, వంశీ, హేమంత్, ఆంటోనీ తమ క్యారెక్టర్స్ ను అద్బుతంగా పోషించారు. దర్శకుడు హరినాథ్ పులి చిన్న వాడైనా ఎంతో క్లారిటీగా ఆకట్టుకునేలా సినిమాను రూపొందించాడు. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మేమంతా రేవు సినిమా చూసి ఎలాంటి అనుభూతికి లోనయ్యామో…అదే అనుభూతిని రేపు మీరంతా థియేటర్ లో చూస్తూ పొందుతారు. సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మేము రిలీజ్ డేట్ గురించి అనుకున్నాం. త్వరలోనే ఆ డేట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ- రేవు సినిమా ప్రెస్ మీట్ కు వచ్చిన మీడియా మిత్రులకు వెల్ కమ్. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్న మిత్రులకు కృతజ్ఞతలు. రేవు సినిమాను త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాం. మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. డాక్టర్ మురళీ గింజుపల్లి గారు 15సం॥ గా నాకు నుంచి మంచి మిత్రులు, మేము చెప్పిన వెంటనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తామంటూ ముందుకొచ్చారు. సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో మేము కలసి మరిన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని, ఆయనతో మా ట్రావెల్ కొనసాగాలని కోరుకుంటున్నాం. నాకు నచ్చి రేవు చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉన్న ప్రభు గారి పర్యవేక్షణలో రేవు సినిమాను విడుదలకు తీసుకురావడం సంతోషంగా ఉంది అన్నారు.

నిర్మాత డా॥ మురళీ గింజుపల్లి మాట్లాడుతూ – నేను యూఎస్ లో ఉంటాను. సినిమాలంటే ప్యాషన్. గత పదిహేనేళ్లుగా చిత్ర పరిశ్రమకు దగ్గరగా ఉంటున్నాను. మా సంస్థ ద్వారా మొదట ఒక మంచి సినిమాతో అడుగుపెట్టాలని కోరుకున్నాను. రేవు సినిమా గురించి పర్వతనేని రాంబాబు చెప్పటం ఆయన నిర్ణయానికి ఓకే అనటం మాకు ఆ అవకాశం కల్పించిన ప్రభు గారికి థ్యాంక్స్. రాంబాబు గారు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఆయనతో మా సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ లో మరిన్ని మూవీస్ చేయబోతున్నాం. ప్రభు గారు మా పక్కన ఉంటే ఆ దాసరి గారే మా పక్కన ఉండి నడిపిస్తున్నట్టుగా ఉంది. రేవు సినిమా కాపీ చూశాక నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మంచి మూవీ. మేము ఇప్పుడు చెబుతున్న మాట సినిమా చూశాక మీరంతా చెబుతారు. మత్స్యకారుల జీవితాల్లోని ఒడిదొడుకులు, వారి జీవన విధానాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు దర్శకుడు హరి. రేవు సినిమా గురించి చెప్పగానే నా స్నేహితుడు నవీన్ పారుపల్లి కూడా మూవీలో భాగమవుతానంటూ ముందుకొచ్చారు. త్వరలోనే మంచి డేట్ చూసి మీ ముందుకు రేవు సినిమాను తీసుకొస్తాం అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ – మా రేవు సినిమాకు ప్రభు గారు, పర్వతనేని రాంబాబు గారు, డాక్టర్ మురళీ గారు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా పూర్తయ్యాక దీన్ని ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్న టైమ్ లో పర్వతనేని రాంబాబు గారు, ప్రభు గారు మాకు పరిచయం అయ్యారు. వారు ఎంత సహాయం చేశారో మాకు మాత్రమే తెలుసు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు హరినాథ్ కి థ్యాంక్స్. రేవు సినిమా మీ అందరికీ నచ్చేలా ఒక మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంటుంది అన్నారు
నటుడు హేమంత్ మాట్లాడుతూ – మేము ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడుతున్నామంటే నటుడిగా ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కారణం. మా నాన్న ఉంటే నన్ను ఇలా చూసి సంతోషించేవారు. రేవు మూవీలో విలన్ క్యారెక్టర్ లో మీ ముందుకు రాబోతున్నాను. మా టీమ్ కు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. మా సినిమాను, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రభు గారికి, పర్వతనేని రాంబాబు గారికి, డాక్టర్ మురళీ గింజుపల్లి గారికి థ్యాంక్స్ అన్నారు.


నటుడు ఆంటోనీ మాట్లాడుతూ – రేవు సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు హరికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఓ మంచి రోల్ లో నటించాను. మట్టి ముద్దలా సెట్ కు వెళ్లిన మమ్మల్ని మంచి బొమ్మల్లాంటి పర్ ఫార్మెన్స్ తీసుకున్నారు దర్శకుడు హరినాథ్. రేవు మూవీ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ బాషా మాట్లాడుతూ – రేవు సినిమా దర్శకుడు హరి నాకు బాగా పరిచయం. ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ తో పాటు మంచి క్యారెక్టర్ కూడా ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్. అన్నారు.
దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ – మా రేవు మూవీ ప్రెస్ మీట్ మీ అందరి సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది. మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాను. అన్ని ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. మా రేవు సినిమాను ఎలా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ప్రభు గారు, పర్వతనేని రాంబాబు గారు, ప్రొడ్యూసర్ డా.మురళీ గింజుపల్లి గారు ముందుకు వచ్చి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు అన్నారు.
ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు
సాంకేతిక నిపుణులు:
డి ఓ పి – రేవంత్ సాగర్
నేపథ్య సంగీతం- వైశాక్ మురళీధరన్
పాట- జాన్ కె జోసెఫ్
ఎడిటర్ – శివ శర్వాని
కళ- బాషా
సాహిత్యం – ఇమ్రాన్ శాస్త్రి, నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు,
నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి, రచయిత దర్శకుడు – హరినాథ్ పులి

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago