“భజే వాయు వేగం” సినిమాకు అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన సినిమా “భజే వాయు వేగం”. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ రోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “భజే వాయు వేగం” సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లోని యూవీ ఆఫీస్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

హీరో కార్తికేయ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్కరు కూడా నెగిటివ్ గా చెప్పడం లేదు. సాధారణంగా సినిమాలో ఫలానా ఎలిమెంట్ బాగుందని చెబుతారు. కానీ “భజే వాయు వేగం” సినిమా చూసినవాళ్లు కంప్లీట్ మూవీ నచ్చిందని అంటున్నారు. ఈ రేంజ్ సినిమా ఇంత ఎమోషనల్ గా తెరకెక్కి ప్రేక్షకుల మెప్పు పొందడం హ్యపీగా ఉంది. ఆర్ఎక్స్ 100 కంటే ఎక్కువ ఎమోషన్ ఈ సినిమాలో వర్కవుట్ అయ్యింది. మేము కథను నమ్మి ఎలాంటి మూవీ చేయాలనుకున్నామో, అలాంటి మూవీ చేశాం. సక్సెస్ కూడా మేము ఆశించినట్లే దక్కింది. “భజే వాయు వేగం” సినిమా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని నా నెక్ట్ మూవీస్ ప్లాన్ చేసుకుంటాను. ఈ సినిమాతో ప్రేక్షకులు నాకు ఇచ్చిన ప్రేమ, ఆదరణను, నా సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నా తదుపరి సినిమాలు చేస్తూ పనిచేస్తాను. అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ – నిన్న మా క్లోజ్ సర్కిల్, ఫ్యామిలీ మెంబర్స్ కు షో వేశాం. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో నాలో కొంత ఒత్తిడి తగ్గింది. ఇందాకే సంధ్య థియేటర్ లో మూవీ చూసి వచ్చాను. థియేటర్ లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక మాకెంతో హ్యాపీ ఫీలింగ్ కలిగింది. సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని, సెకండాఫ్ గ్రిప్పింగ్ గా ఉందని చెబుతున్నారు.
మేము ప్రేక్షకుల్ని గౌరవించి, వాళ్లకు నచ్చే ఎమోషన్స్ తో సినిమా రూపొందించాం. ప్రేక్షకులు మాకు తిరిగి రెట్టింపు గౌరవాన్ని ప్రేమను అందిస్తున్నారు. థ్యాంక్యూ. టాక్ బాగుందని వచ్చింది కాబట్టి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి థియేటర్ లో చూడండి. అన్నారు.

యాక్టర్ రాహుల్ టైసన్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమాను ఈ రోజు మొదటిసారి థియేటర్ లో చూశా. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు 15 ఏళ్ల తర్వాత ఒక హిట్ సినిమా దక్కింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను కార్తికేయ నమ్మకంతో వర్క్ చేశాం. ఇందులోని ఎమోషన్స్ అందరికీ రీచ్ అవుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. యూవీ బ్యానర్ కు థ్యాంక్స్. డైరెక్టర్ ప్రశాంత్ నేనొక హిట్ మూవీతో తిరిగొచ్చేలా చేశాడు. కార్తికేయతో ఈ మూవీ చేస్తున్నప్పుడు తెలియలేదు గానీ ఈ రోజు స్క్రీన్ మీద చూస్తుంటే నటుడిగా అతని పర్ ఫార్మెన్స్ నెక్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమా నుంచి కార్తికేయ నటుడిగా మరింత హైట్స్ చూడాలని కోరుకుంటున్నా. “భజే వాయు వేగం” సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన కపిల్ కుమార్ మాట్లాడుతూ – “భజే వాయు వేగం” సినిమా హిట్ అవుతుందని మేము ముందే ఊహించాం. ఈ సినిమా కోసం అప్రోచ్ అయిన 30 నిమిషాలకే నాకు అవకాశం ఇస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ చెప్పారు. ఈ సినిమాలో కార్తికేయ, రాహుల్, రవిశంకర్, తనికెళ్ల భరణి గారు చేసిన మంచి పర్ ఫార్మెన్స్ వల్లే బీజీఎం బాగా కుదిరింది. నా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చిన ప్రశాంత్, యూవీ ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago