బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న కింగ్ నాగార్జున.. టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పిన నాగార్జున

దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన సినిమా’తల’. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా పరిచయం అవుతున్నాడు. అంకిత నస్కర్ హీరోయిన్. రోహిత్, ఎస్తేర్ నోరన్హ,ముక్కు అవినాష్, సత్యం రాజేష్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ధర్మతేజ సంగీత దర్శకుడు. తల సినిమా ఈ 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే తలపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ చూసిన వాళ్లంతా ప్రామిసింగ్ గా ఉందని మెచ్చుకుంటున్నారు.

ఇక తాజాగా కింగ్ నాగార్జున బుక్ మై షోలో ఈ మూవీ ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ చిత్ర ట్రైలర్ ను చూసి చాలా మెచ్చుకున్నారు. రాగిన్ రాజ్ పెద్ద హీరో అవుతాడని ఆశీర్వదించారు. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కితాబునిచ్చారు. అమ్మ రాజశేఖర్ తో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుని ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని ఆకాక్షిస్తూ.. నిర్మాత శ్రీనివాస్ గౌడ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

బుక్ మై షోలో నాగార్జున తల మూవీ ఫస్ట్ టికెట్ ను కొనడం ఈ సినిమా సాధించబోతోన్న పెద్ద విజయానికి చిహ్నం అని దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

17 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

17 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

17 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago