‘నమో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భీమనేని శ్రీనివాసరావు

విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలు విస్మయ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఏ.ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఆదిత్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. అతను ఎంతో కష్టపడతాడు. మంచి టాలెంట్ ఉంది. ఆదిత్య ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటాడనిపిస్తోంది. సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ వరకు తీసుకు రావడమే గొప్ప విషయం. యంగ్ టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘నన్ను పెద్ద సినిమా ఫంక్షన్‌లకు పిలిచినా వెళ్తాను. చిన్న సినిమా ఈవెంట్‌లకు ఆహ్వానించినా వస్తాను. కానీ చిన్న చిత్రాల ప్రమోషన్స్‌కి వస్తే.. వారికి ఎంతో సాయం చేసినట్టుగా అవుతుంది. హీరోయిన్ విస్మయ తెలుగమ్మాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసింది. మంచి స్టార్ హీరోయిన్ అయ్యే సత్తా ఉన్న నటి. కొత్త దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నారు. కథను నమ్మి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు ఎప్పుడూ విజయం చేకూరాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఆదిత్యకు ఆల్ ది బెస్ట్. విశ్వంత్ మంచి నటుడు. మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఆయనకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.

రోమ్ భీమన మాట్లాడుతూ.. ‘మా పురుషోత్తముడు టీజర్‌ను ఈ స్టేజ్ మీదే రిలీజ్ చేశాం. ఇప్పుడు నమో ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నమో అనేది అందరికీ సుపరిచితం. టైటిల్ చాలా బాగుంది. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం ఉంది. ఇక ఆ టెన్షన్‌ను పోగొట్టేందుకు నమో రాబోతోన్నట్టుగా ఉంది. విశ్వంత్ సినిమాలు చూస్తుంటాను. పెద్ద హీరో అయ్యే ఫీచర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను తీయడం ఈజీ. కానీ రిలీజ్ చేయడం కష్టం. ఈ మూవీని అందరూ ఆదరించి విజయవంతం చేయాలి’ అని అన్నారు.

ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన గురువు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ గారు సినిమాను నిర్మించారు. మంచి కథకి, సబ్జెక్ట్‌కి విశ్వంత్ లాంటి మంచి హీరో దొరకడంతోనే నమో సినిమాగా మారింది. అనురూప్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. విస్మయ మంచి నటి. రాహుల్ శ్రీ వాస్తవ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ట్రైబల్ సెట్‌ను కిరణ్ కుమార్ అద్బుతంగా వేశారు. క్రాంతి ఆచార్య నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. చక్కని సంగీతం ఇచ్చారు. నా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి విజయవంతం చేయండి’ అని అన్నారు.

విశ్వంత్ దుద్దంపూడి మాట్లాడుతూ.. ‘నమో నాకు కేవలం ఓ సినిమా కాదు. నాకు ఇదొక ఎమోషన్. టీం అంతా కలిసి ఎంతో సంతోషంగా పని చేశాం. ఓ ఫ్యామిలీలా కలిసి షూటింగ్ చేశాం. ఆదిత్య రాసిన పాత్రలు అద్భుతంగా వచ్చాయి. లాజిక్స్ పక్కన పెట్టి మ్యాజిక్ చూడండి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుంది. అనురూప్ చాలా టాలెంటెడ్. విస్మయ చక్కగా నటించింది. నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘ఆదిత్య, డీఓపీ రాహుల్ నాకు మంచి స్నేహితులు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ నిర్మించాను. ఆ ఇద్దరికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. విశ్వంత్, అనురూప్, విస్మయలు చాలా కష్టపడతారు. రిమోట్ ఏరియాలో టీం అంతా కష్టపడింది. క్రాంతి ఆచార్య మంచి సంగీతాన్ని ఇచ్చారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.

అనురూప్ మాట్లాడుతూ.. ‘నా తల్లిదండ్రులు ఇచ్చిన సపోర్ట్‌తో ఇక్కడి వరకు వచ్చాను. మా నమో సినిమా జూన్ 7న రాబోతోంది. సినిమా కోసం టీం అంతా కష్టపడింది. మోహన్ అనే పాత్ర మా దర్శకుడు ఆదిత్యదే అనిపిస్తుంది. అంత మంచి కారెక్టర్‌ను నాకు ఇచ్చినందుకు థాంక్స్. మా ఈవెంట్‌కు వచ్చిన భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. ప్రశాంత్ గారి వల్ల ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. విస్మయ చక్కగా నటించింది. విశ్వంత్ నాకు సోదరుడు లాంటి వాడు. ఎంతో సపోర్టివ్‌గా నిలిచాడు. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

విస్మయ శ్రీ మాట్లాడుతూ.. ‘అటవీ ప్రాంతంలో సినిమాను ఎంతో కష్టపడి షూట్ చేశాం. ప్రశాంత్ గారి నిర్మాణంలో రెండు చిత్రాలు చేశాను. మూడో సినిమా కూడా చేయబోతున్నాం. ఆదిత్య గారు బయటకు కనిపించే అంత సైలెంట్ అయితే కాదు (నవ్వుతూ). విశ్వంత్ గారు సెట్స్‌లో ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. అనురూప్ మంచి ఫ్రెండ్ అయ్యారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago