నటుడు జోజు జార్జ్ దర్శకుడిగా డెబ్యూ చిత్రం ‘పణి’ ఫస్ట్ లుక్ విడుదల !!!

జోజు జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచయమైన నటుడు. ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించారు. అద్భుతమైన నటన కనబరిచారు. నటుడిగా కొనసాగుతూనే జోజు జార్జ్ డెబ్యూ డైరెక్టర్ గా ‘పణి  ‘ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. పణి  చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. జోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ , రివేంజ్ డ్రామాగా అలరించబోతోంది. 

జోజు ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. ఈ చిత్ర కథానాయకుడు కూడా ఆయనే. జోజు నుంచి చిత్రాలు కోరుకునే వారు ఈ ఫస్ట్ లుక్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. అభినయ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ ఇప్పుడే రిలీజ్ చేశారు. మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తయ్యాక థియేటర్స్ లోకి రానుంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సాగర్, జునైస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

తన 28 ఏళ్ళ సినీ కెరీర్ లో జోజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. జోజు జూనియర్ ఆర్టిస్ట్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన పేరు ముందు డైరెక్టర్ అనే పదం చేరబోతోంది. జోజు నటుడిగా కార్తీక్ సుబ్బరాజ్, సూర్య చిత్రంతో పాటు బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న అనురాగ్ కశ్యప్ చిత్రాన్ని జోజు స్వయంగా నిర్మిస్తున్నారు.

Tfja Team

Recent Posts

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

19 hours ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago