ది బ‌ర్త్‌డే బాయ్ టైటిల్ గ్లింప్స్ విడుద‌ల

ఇప్పుడు రొటిన్ క‌థ‌ల‌కు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్య‌మైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది.

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల  ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.. ఇద్ద‌రూ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్న ఫ‌న్ని సంభాష‌ణ‌తో ఈ టైటిల్ గ్లింప్స్ ప్రారంభ‌మై చిత్రంలో పాత్ర‌ల‌ను ప‌రిచయం చేస్తూ ఓపెన్ అవుతుంది.

ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు  చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం.

 కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండ‌బోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని,  రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భ‌ర‌త్‌,
డీఓపీ : సంకీర్త్ రాహుల్‌,  సంగీతం: ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌: న‌రేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్‌:
సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌: అర‌వింద్ మీన‌న్‌, మేక‌ప్ చీఫ్‌:
వెంక‌ట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్‌: ఫ‌స్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago