థ్రిల్లర్స్ ఇష్టపడేవారు “సత్యభామ” మూవీని ఎంజాయ్ చేస్తారు

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఈ నెల 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమాకు మ్యూజిక్ అందించిన ఎక్సీపిరియన్స్ తెలిపారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల.

  • కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తుండటం “సత్యభామ” మూవీ మీద నాకు ఎగ్జైట్ మెంట్ పెంచింది. అలాగే శశికిరణ్ తో నేను చేస్తున్న మూడో చిత్రమిది. డైరెక్టర్ సుమన్ కూడా బాగా పరిచయం. స్నేహితులతో కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఎగ్జైట్ గానే పనిచేస్తాం. మిగతా వారితో వర్క్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఉండదని కాదు. పదేళ్లుగా కలిసున్న ఫ్రెండ్స్ అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. కాజల్ కు పర్పెక్ట్ కమ్ బ్యాక్ మూవీ ఇదని అనుకోవచ్చు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
  • థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి “సత్యభామ” బాగా నచ్చుతుంది. ఇందులోని ట్విస్ట్ లు టర్న్ లు సూపర్బ్ గా ఉంటాయి. ఒక పోలీస్ ఆఫీసర్ ఎమోషనల్ జర్నీ ఇది. “సత్యభామ”లోని యాక్షన్ సీక్వెన్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాజల్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ తనే సొంతంగా చేసేంది. బిడ్డ పుట్టిన తర్వాత తను ఇంత భారీ యాక్షన్ సీక్వెన్సులు చేయడం అంత ఈజీ కాదు. ఆ యాక్షన్ సీక్వెన్సులు చూసి నేను ఇన్స్ పైర్ అయ్యి మ్యూజిక్ చేశాను.
  • “సత్యభామ”లో మొత్తం ఐదు పాటలుంటాయి. ముందు రెండు సాంగ్స్ అనుకుని స్టార్ట్ చేశాం. కళ్లారా చూసాలే అనేది కాజల్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ సాంగ్, వెతుకు వెతుకు కీరవాణి గారు పాడారు. ఇది కాజల్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ సాంగ్ చేశాం. మిగతా లిరికల్ సాంగ్స్ త్వరలో రిలీజ్ చేస్తాం. ఈ పాటలన్నీ సినిమాలో ఉంటాయి.
  • ఈ సినిమాలో వెతుకు వెతుకు పాటకు కీరవాణి గారు, చంద్రబోస్ గారితో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేని విషయం. గతంలో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాకు నా మ్యూజిక్ లో కీరవాణి గారు పాడారు. “సత్యభామ” పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే నా పాట ఏది విన్నావ్, ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్ అని అడిగారు. చంద్రబోస్ గారు కూడా ట్యూన్ మీటర్ కు పాట ఇచ్చి వెళ్లిపోకుండా డిస్కస్ చేస్తూ పాట బాగా వచ్చేవరకు మాతోనే ఉన్నారు. వాళ్లు అంత సీనియర్స్ అయి ఉండి కూడా వర్క్ మీద చూపించే శ్రద్ధ కొత్తవాళ్లు నేర్చుకోవాలి.
  • థ్రిల్లర్ మూవీస్ కు ఎక్కువ వర్క్ చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. అయితే నేను మొత్తం థ్రిల్లర్ మూవీస్ చేయలేదు. కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్ వంటి లవ్, కమర్షియల్ చిత్రాలకూ సంగీతాన్ని అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకు పర్సనల్ గా మాస్, కమర్షయిల్ మూవీస్, లవ్ స్టోరీస్ చేయాలనే కోరిక ఉంటుది. గూఢచారి 2 తర్వాత థ్రిల్లర్ ఎన్ని చేస్తానో తెలియదు.
  • థ్రిల్లర్ మూవీస్ లో సాధారణంగా బీజీఎంకు ఎక్కువ పేరొస్తుంది. అలాగని పాటలు బాగుండవని కాదు. పాటలు బాగున్నా ఆడియెన్స్ బీజీఎంకు ఎక్కువ కనెక్ట్ అవుతారు. నాకు డిఫరెంట్ జానర్ మూవీస్ కు మ్యూజిక్ చేయాలని ఉంటుంది. మేజర్ లో హృదయమా పాట హిట్ అయ్యింది, డీజే టిల్లులో పటాస్ పిల్లా హిట్ అయ్యింది. నేను అన్ని రకాల మూవీస్ కు పాటలు చేయగలను. కానీ అలాంటి అవకాశాలు కూడా రావాలి కదా. నేను చిన్నప్పుడు గజల్స్ ఎక్కువగా వినేవాడిని. రాక్ మ్యూజిక్ చేశాను. నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరా అసిస్టెంట్ గా పనిచేయలేదు. క్షణం సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమాకు నేను ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులకు నచ్చింది. అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను.
  • ఇప్పుడు ఆడియెన్స్ చాలా క్లియర్ గా మూవీ చూస్తున్నారు. మ్యూజిక్ ఏంటని గుర్తుపడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి లేపేసి పెడితే కుదరదు. వారికి కొత్తగా మ్యూజిక్ ఇవ్వాలి. ఆ క్వాలిటీ కోసం నిద్రలేకుండా కూడా పనిచేస్తా.
  • నేను ఎవరితో పోటీ అనుకోను. నాకు నేనే పోటీగా భావిస్తా. నా తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో వివేక్ సాగర్, కాళభైరవ, ప్రవీణ్ లక్కరాజ్ వంటి అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇప్పటిదాకా నేను హాలీడే కు వెళ్లలేదు. మూవీ తర్వాత మూవీ వస్తూనే ఉంది. నాకు అదృష్టవశాత్తూ మంచి డైరెక్టర్స్ పరిచయం అయ్యారు. కృష్ణ అండ్ హిస్ లీలలో చిన్న క్యారెక్టర్ లో కనిపించాను. ఫ్రెండ్స్ మూవీస్ లో సరదాగా ఏదైనా క్యారెక్టర్ చేయమంటే చేస్తా. కానీ యాక్టింగ్ కెరీర్ గా తీసుకోవడానికి టైమ్ లేదు. సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. గూఢచారి 2 తర్వాత మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి.
Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago