తెలుగు ప్రేక్ష‌కుల‌కు యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పొలిశెట్టి స్పెష‌ల్ మెసేజ్‌..

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మూడు వ‌రుస బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్‌తో మెప్పించిన యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పొలిశెట్టి. థియేట్రిక‌ల్‌గానే కాకుండా ఓటీటీలోనూ న‌వీన్ న‌టించిన సినిమాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. దీంతో ఆయ‌న‌తో సినిమా చేయటానికి నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు.

న‌వీన్ పొలిశెట్టి సినీ ఇండ‌స్ట్రీలోకి త‌న‌కు తాను ఎవ‌రి అండ‌దండ‌లు లేకుండా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో మెట్టు ఎదుగుతూ తక క‌ష్టం, ప్ర‌తిభ‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు. వైవిధ్యంగాక‌థాంశాల‌ను ఎంచుకునే న‌వీన్ చిత్రాల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూడ‌టం ప్రారంభించారు. అయితే తన ప్ర‌యాణం అనుకున్నంత సులువుగా జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల దుర‌దృష్ట‌వ‌శాత్తు ఓ ప్ర‌మాదానికి గుర‌య్యారు న‌వీన్‌. దీంతో ఆయ‌న చేతికి ప‌లు గాయాల‌య్యాయి. దీంతో ఆయ‌న కొన్నాళ్లు షూటింగ్స్‌లో పాల్గొన‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో  ఓ భావోద్వేగ‌భ‌రిత‌మైన ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచిన న‌వీన్ మొట్ట‌మొద‌టిసారి ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు త‌గిలిన గాయాల నుంచి జ‌రుగుతున్న ఫిజియోథెర‌ఫీ చికిత్స గురించి తెలియ‌జేస్తూ గాయాల నుంచి క‌ష్టం మీద కోలుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. త‌న సినిమాల‌ మీద ప్ర‌భావం చూపించిన ఇలాంటి గాయాల నుంచి శారీర‌కంగా, మాన‌సికంగా కోలుకోవ‌టం చాలా క‌ష్టం. అయితే న‌వీన్ చాలా త్వ‌ర‌గా కోలుకుంటున్నారు. త్వ‌ర‌లోనే పూర్తి స్థాయిలో కోలుకుంటున్నాన‌ని త‌న అభిమానుల‌కు తెలియ‌జేశారు న‌వీన్‌.

అస‌లు న‌వీన్ పొలిశెట్టి ఎక్కడున్నాడంటూ అంద‌రూ అడ‌గ‌టం మొద‌లు పెట్టారు. దీంతో అస‌లు కార‌ణాన్ని ఈ యంగ్ హీరో అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్రమాదంలో చేయికి బ‌ల‌మైన గాయాలు త‌గిలాయ‌ని, ఆ చేతిని కొన్ని నెల‌లుగా ఉప‌యోగించ‌టం చాలా క‌ష్టంగా మారింద‌ని చెప్పిన న‌వీన్.. అభిమానులు, ప్రేక్ష‌కుల ప్రేమాభిమానాలే త‌న‌ను ముందుకు న‌డిపిస్తున్నాయ‌ని అన్నారు. హీరోగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంటున్న త‌రుణంలో ఇలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌టం కాస్త ఇబ్బందిక‌ర‌మే అయినా, న‌వీన్ క‌చ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతార‌నటంలో సందేహం లేదు.

ప్ర‌స్తుతం న‌వీన్ ప‌ని చేయాల‌నుకుంటున్న సినిమాల‌కు సంబంధించిన మేక‌ర్స్ మంచి కంటెంట్‌, గ్రిప్పింగ్ క‌థ‌, క‌థ‌నాల కోసం రెండేళ్ల స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. ఇది యాదృచ్చికంగానే జ‌రిగింది. న‌వీన్ కూడా అంతే! ఎక్కువ సినిమాలు చేయ‌టం కంటే మంచి క్వాలిటీ ఉన్న కంటెంట్ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అంద‌చేయాల‌నేది ఆయ‌న ల‌క్ష్యం. దీన్ని ఆయ‌న ముందు నుంచి ఫాలో అవుతున్నారు. అందువ‌ల్ల‌నే మంచి సినిమాల‌ను న‌వీన్ అందించ‌గ‌లిగారు.

న‌వీన్ పొలిశెట్టి గాయం కార‌ణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఈ స‌మ‌యంలో ఆయ‌న త‌న సినిమాల‌కు సంబంధించి రైటింగ్, దానికి సంబంధించిన డెవ‌ల‌ప్‌మెంట్ వ‌ర్క్ మీద ఫోక‌స్ చేసిన‌ట్లు తెలియ‌జేశారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్‌, నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్‌ల‌లో సినిమాలు చేయాల్సి ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న త‌ర్వాత న‌వీన్ ఓ సినిమా త‌ర్వాత మ‌రో సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మ‌రిన్ని వైవిధ్య‌మైన సినిమా క‌థ‌ల‌ను చ‌దువుతున్నాన‌ని రీసెంట్‌గానే త‌న సోష‌ల్ మీడియా ద్వారా న‌వీన్ పేర్కొన్నారు. రాబోయే ఏడాది న‌వీన్ పొలిశెట్టి, అత‌ని అభిమానుల‌కు ఎంతో కీల‌కంగా మార‌నుంది. ఎందుకంటే యంగ్ సెన్సేష‌న్ నుంచి సినిమాలు రూపొంద‌నున్నాయి. ఈ క్ర‌మంలో అభిమానులు న‌వీన్ పొలిశెట్టి రాక కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

20 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago