తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ హై బడ్జెట్ మల్టీ లింగ్వల్ ఫిల్మ్ ‘ఓదెల 2’ కీలకమైన యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం
తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి స్టైలిష్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రియేట్ చేసిన 2021 హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ అయిన ‘ఒదెల-2 కోసం’ కోసం చేతులు కలిపారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు
ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది.
హై-బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించింది. సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటాయి. ఇన్నోవేటీవ్ స్టంట్స్ , బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి.
ఈ సన్నివేశాలు పెర్ఫెక్షన్, రియలిజంతో అద్భుతంగా చిత్రీకరించడానికి టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్స్‌కి ప్రాణం పోసేందుకు ఎక్స్ పర్ట్ స్టంట్ కోఆర్డినేషన్ టీం పని చేస్తోంది. ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.
ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయగల ఎబిలిటీ వున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, ‘ఓదెల 2’ ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.
మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్. ఎస్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…