అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్‌గా నటిస్తున్న శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్‌లో టీమ్‌తో జాయిన్ అయింది. ఈ ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్‌లో మేకర్స్ లీడ్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శృతి హాసన్, శేష్‌తో సెల్ఫీని షేర్ చేశారు.
డకాయిట్ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ, వారు తమ లైఫ్స్ ని మార్చడానికి వరుస దోపిడీలకు ఏకం కావాలి. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్‌బస్టర్‌లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్‌ను సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.
అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రం 2022లో ప్రశంసలు పొందిన ‘మేజర్’ తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ.
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: అడివి శేష్, శృతి హాసన్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: షానీల్ డియో
కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్, షానీల్ డియో
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సహ నిర్మాత: సునీల్ నారంగ్
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…