“గం..గం..గణేశా” పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “గం..గం..గణేశా”. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన “గం..గం..గణేశా” సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ – మా “గం..గం..గణేశా” సినిమాను ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాము. మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ సీన్స్ కు ఊగిపోతూ నవ్వుతున్నారు. ఫ్యామిలీస్ తో మీడియా మిత్రులు వచ్చి సినిమా చూశారు. మా దర్శకుడు ఉదయ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా రూపొందించారు. అన్ని మేజర్ క్యారెక్టర్స్ కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మా మూవీతో పాటు రిలీజైన మరో రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం సంతోషకరం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి మరోసారి “గం..గం..గణేశా” చూసేందుకు వెళ్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాకు థియేటర్స్ లో క్లాప్స్, విజిల్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, చెక్ పోస్ట్ సీన్, క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్టులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నెల కిషోర్ చేసిన ఆర్గాన్ డేవిడ్ క్యారెక్ట్ కు కూడా హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. మా “గం..గం..గణేశా” సినిమాకు ఇంత సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.

నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ ఆర్గాన్ డేవిడ్, ఇమ్మాన్యుయేల్ చేసిన శంకర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యింది. ఆనంద్ కు కూడా కొత్త తరహా సినిమా ఇదని రివ్యూస్ వస్తున్నాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మంచి బీజీఎం ఇచ్చారు. నెక్ట్ మూవీ కూడా ఆయనతోనే చేస్తాం. అన్నారు.

యాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ – “గం..గం..గణేశా”తో మా ఉదయ్ గారు ఫస్ట్ మూవీనే హిట్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆనంద్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆయన పర్ ఫార్మెన్స్ అదిరిపోయింది. మా చిత్రానికి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్నారు.

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ – మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆనంద్ అన్న నేను అనుకున్నాం ఈ సినిమాకు కామెడీ వర్కవుట్ అయి ఫ్యామిలీస్ వస్తే మనం సక్సెస్ కొట్టినట్లే అని. ఈ రోజు ఆ మాట నిజమైంది. మా “గం..గం..గణేశా” సినిమాకు ఫ్యామిలీ ఆడియెన్స్ వస్తున్నారు. ఈ చిత్రంతో నా పేరు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నుంచి వెస్టిండీస్ గా మారిందని అంటున్నారు. నెక్ట్ టు డేస్ వీకెండ్ కాబట్టి మా మూవీ థియేటర్స్ కు పెద్ద సంఖ్యలో ఆడియెన్స్ వస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – “గం..గం..గణేశా” సినిమాకు మీరు ఇస్తున్న రెస్పాన్స్, సపోర్ట్ కు థ్యాంక్స్. ఇటీవల కాలంలో మనకు మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రాలేదు. “గం..గం..గణేశా” పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మా మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రెస్పాన్స్ బాగుంది. ఫస్ట్ మూవీతోనే మా డైరెక్టర్ హిట్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్ ప్రాజెక్ట్ బాగా వచ్చేందుకు పూర్తి సపోర్ట్ అందించారు. ఈ రోజు రిలీజ్ కాబట్టి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసు. ముందు ముందు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నా. “గం..గం..గణేశా”లో వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్, యావర్..ఇలా ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ బాగా వచ్చాయి. ఒక మిస్టికల్ ఎలిమెంట్ కూడా గణేశుడి గురించి ఉంది. అన్నయ్య విజయ్ ఈ సినిమాను రిలీజ్ కు ముందే చూసి బాగుందని చెప్పారు. ఈ వీకెండ్ మా సినిమాకు ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లండి. ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

Tfja Team

Recent Posts

మహేష్ విట్ట ‘’ఉత్తుత్త హీరోలు‘’ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు

‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…

4 hours ago

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…

1 day ago

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కి యువ నిర్మాత వంశీ నందిపాటి విరాళం

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…

2 days ago

మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ”ఓం శాంతి శాంతి శాంతిః”

సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…

2 days ago

బుక్ మై షోలో 100కె టికెట్ బుకింగ్స్ క్రాస్ చేసిన బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ”

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…

2 days ago

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…

2 days ago