విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్‌లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప”గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని సూచిస్తుంది.
“ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప” కేవలం సినిమా కాదు.. ఇది ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ కానుంది. కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచించబోతోంది. ఇక రెడ్ కార్పెట్ మీద ఈ సినిమా రాక కోసం అందరూ చూస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు తన టీంతో కలిసి తెలుగు చిత్రసీమలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచేలా కన్నప్పను తెరకెక్కిస్తున్నారు.
“కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించబోవటం మాకు చాలా ఆనందంగా ఉంది” అని విష్ణు మంచు ట్వీట్ వేశారు. “ప్రపంచ ప్రేక్షకులకు మేం ఎంతో ఇష్టంగా రూపొందించిన కన్నప్పను ప్రదర్శించడానికి కేన్స్ అనువైన వేదికగా ఉపయోగపడుతుంది. మన భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
“ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప” కేన్స్ అరంగేట్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇది గ్లోబల్ సినిమా ల్యాండ్‌స్కేప్‌లో చెరగని ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. ఆకర్షణీయమైన కథనం, అద్భుతమైన చిత్రీకరణ, భారీ తారాగణంతో, అందరికీ ఓ మంచి అనుభూతినిచ్చేలా సినిమాను రూపొందిస్తున్నారు.
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచె టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…
లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…