ఆహాలో స‌రికొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’.. టీజర్ విడుదల

న్యూసెన్స్ సీజన్ 1లో ప్రధాన తారాగణంగా నవదీప్, బిందు మాధవి

– మీడియా గురించి ఆలోచన రేకెత్తించే సరికొత్త క‌థాంశం –

హైద‌రాబాద్‌, మార్చి 21, 2023:  తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న 100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో స‌రికొత్త ఒరిజిన‌ల్ వెబ్ సిరీస్ న్యూసెన్స్ సీజ‌న్ 1 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీని టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. శ్రీ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ 2వ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సిరీస్‌ను నిర్మించారు. న‌వ‌దీప్, బిందు మాధ‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

LINK – https://www.youtube.com/watch?v=k2LClS25RZM

1990-2000 ద‌శ‌కంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ద‌న‌ప‌ల్లె ప్రాంతానికి చెందిన ప్రెస్ క్ల‌బ్‌లోని స్ట్రింగర్స్ గురించి తెలియ‌జేసిన ప‌వ‌ర్‌ఫుల్ వెబ్ సిరీస్‌గా నూసెన్స్ సీజ‌న్ 1న రూపొందిస్తున్నారు. మ‌న స‌మాజంలో ఎంతో ప్రాధాన్యత క‌లిగిన మీడియా పాత్ర ఏంటి? అనే ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతుంది. లంచ‌గొండి సంస్కృతి పెరిగిపోవ‌టం, వార్త‌ల ప్రాధాన్య‌త‌, సెన్సేష‌న్ న్యూస్ అనే అంశాల‌ను ఈ సిరీస్‌లో ప్ర‌స్తావిస్తున్నారు.

న్యూసెన్స్ టీజ‌ర్‌ను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని నేరుగా చెప్పిన తీరుతో పాటు స‌ద‌రు పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టుల అద్భుత‌మైన న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు సీట్ ఎడ్జ్ అనుభూతిని క‌లిగిస్తుంద‌నటంలో సందేహం లేదు. ఓ బ్రేకింగ్ న్యూస్‌ను ఎంపిక చేసుకునే సంద‌ర్భంలో మ‌న‌లో తెలియ‌ని నైతిక సందిగ్ధ‌త నెల‌కొని ఉంటుంది. ఎందుకంటే నిజ‌మైన వార్త‌ను చెప్పాలా, ప్ర‌జాద‌ర‌ణ పొందే వార్త‌ల‌ను బ్రేకింగ్ న్యూస్‌గా ఎంపిక చేసుకోవాలా అనే ఆలోచ‌న‌లు ఎప్పుడూ ఉంటాయి. జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న ఉద్వేగ‌భ‌రిత‌మైన స‌వాళ్ల‌ను కూడా న్యూసెన్స్‌లో ఆవిష్క‌రించ‌బోతున్నారు.

 టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా, ‘‘ఒక స‌మాజంలో ఉండే వ్య‌క్తులుగా మ‌నం నిజాల‌ను తెలుసుకోవ‌టానికి జవాబుదారీతనాన్ని పెంచ‌టానికి మీడియాపై ఆదార‌ప‌డ‌తాం. మ‌న క‌ళ్లు, చెవులుగా భావిస్తాం. అలాంటి మీడియా త‌న‌కు తానుగా రాజీప‌డితే ఎలా? న్యూసెన్స్ సీజ‌న్ 1 సిరీస్ నేటి జ‌ర్న‌లిస్టులు ఎదుర్కొంటున్న నైతిక సందిగ్ధ‌త గురించి లోతుగా ప్ర‌శ్నించే శ‌క్తివంతమైన ఆలోచ‌న‌ను రేకెత్తించే వెబ్ సిరీస్‌.  స‌త్యాన్ని అది ఎలాంటి దాప‌రికాలు లేకుండా నిజాయ‌తీగా చూపించిన తీరు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

దర్శకుడు శ్రీప్రవీణ్ మాట్లాడుతూ ‘‘కచ్చితంగా చెప్పాల్సిన కథ ఇది. న్యూసెన్స్ సీజ‌న్ 1 అనేది మీడియాలో దాగున్న క‌ఠిన‌మైన వాస్త‌వాల‌ను, ప్ర‌జ‌ల‌కు చేర‌వేయాల్సిన వార్త‌ల‌ను జ‌ర్న‌లిస్టులు ఎలా ఎంపిక చేసుకుంటున్నారు అనే దాన్ని తెలియ‌జేస్తుంది. మీడియాలో నైతిక‌త‌, స‌మాజంలో మీడియా పాత్ర అనే దాని గురించిమాట్లాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తెలియ‌జేస్తుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు.

న్యూసెన్స్ సీజన్ 1 అతి త్వరలోనే మన ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రేక్ష‌కుల‌కు  స్ఫూర్తిని క‌లిగిస్తూ, ఛాలెంజింగ్‌గా, ఆలోచింప చేసేదిగా ఈ సిరీస్ ఉంటుంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago