“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

Must Read

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “అంతా రాములోరు చూస్కుంటారు”. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ మేకర్స్ “అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శిరీష పాత్రలో అనస్వర పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ గురించి ఇటీవల టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో చిత్రబృందం ప్రశంసిస్తూ మాట్లాడారు. అనస్వరకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురానుంది.

నటీనటులు – సంగీత్ శోభన్, అనస్వర రాజన్, తదితరులు

టెక్నికల్ టీమ్

రైటర్ – లక్ష్మీ భూపాల్
సమర్పణ – శ్రీమతి శ్రావణి
బ్యానర్స్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని
డైరెక్షన్ – పల్నాటి సూర్యప్రతాప్
డిజిటల్ మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్టా , హౌస్ ఫుల్ డిజిటల్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా) & వంశీ కాక

Latest News

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో...

More News