వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్, మెలోడీ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ డిఐ - అన్నపూర్ణ స్టూడియోస్ పీఆర్వో: వంశీ-శేఖర్
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమా "మాటే మంత్రము". ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ…
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి…
Swathimuthyam, a feel-good family entertainer produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, stars Ganesh and Varsha Bollamma in the…
*నేడు చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు *దసరా శుభాకాంక్షలతో అక్టోబర్ 5 న విడుదల ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై…
Versatile star Naga Shaurya will appear in a role with two different shades in his next outing Krishna Vrinda Vihari…
వెర్సటైల్ హీరో నాగశౌర్య , అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణ వ్రింద విహారి' చిత్రంలో రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. బ్రాహ్మణ కుర్రాడిగా, ఉద్యోగం మీద నగరానికి వచ్చిన తర్వాత అర్బన్ కుర్రాడిగా అలరించనున్నాడు. ట్రైలర్ లో తన నటనతో అదరగొట్టాడు నాగశౌర్య. ఈరోజు చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ని లాంచ్ చేసింది. ఈ పాటలో నాగ శౌర్య ఒక ఇరకాట పరిస్థితిలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. అతని ప్రేమలో సమస్య తో పాటు కుటుంబంతో కూడా చిక్కొచ్చింది. అంతేకాకుండా వెన్నెల కిషోర్ కోమా నుండి మేల్కొలపడానికి ఎదురు చూస్తున్నాడు నాగ శౌర్య . దర్శకుడు అనీష్ కృష్ణ అండ్ టీమ్ ఈ సాంగ్‌ని హిలేరియస్ గా ప్రజంట్ చేశారు. మహతి స్వర సాగర్ క్యాచి నెంబర్ ని స్కోర్ చేయగా, రామ్ మిరియాల ఎనర్జిటిక్ గా పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శౌర్య తల్లిగా అలనాటి నటి రాధిక శరత్‌కుమార్ కనిపించనున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటర్. ‘కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదల కానుంది. తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు సాంకేతిక విభాగం: దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ నిర్మాత: ఉషా ముల్పూరి సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి బ్యానర్: ఐరా క్రియేషన్స్ సంగీతం: మహతి స్వరసాగర్ డివోపీ: సాయిశ్రీరామ్ సహ నిర్మాత: బుజ్జి ఎడిటర్ - తమ్మిరాజు ఆర్ట్ డైరెక్టర్ - రామ్ కుమార్ డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్ పీఆర్వో: వంశీ, శేఖర్
యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులని అలరించే ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు శ్రీకార్తిక్ విలేఖరుల సమవేశంలో పాల్గొని సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు. మొదటి సినిమా సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? కథని రాయడానికి రెండేళ్ళు పట్టింది. సరైన హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన రెండేళ్ళు... సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే నా నిరీక్షణకి తగిన ఫలితం దక్కింది. సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. ఒక బరువు దిగిన భావన కలుగుతోంది. చాలా ఆనందంగా వుంది. ఈ కథ ఆలోచన రావడానికి కారణం మీ అమ్మగారేనా ? అవును. తను బెడ్ మీద వున్నపుడు నేను తీసిన షార్ట్ ఫిల్మ్ చూపించాలని అనుకున్నా. కానీ తను అప్పటికే అపస్మారక స్థితిలో వున్నారు. నేను ఫిల్మ్ మేకర్ అవుతానని కూడా తనకి తెలీదు. ఆ విషయంలో రిగ్రేట్ వుండేది. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లాలనే ఆలోచన ఈ కథకు భీజం వేసింది. ఎమోషన్ ని సైన్స్ లో ఎలా బ్లండ్ చేశారు ? నాకు సైన్స్ చాలా ఇష్టం. ఇందులో సైన్స్ లేకపోతే మెలో డ్రామా అయ్యేది. ఆడియన్స్ కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ కథని సైన్స్ తో ట్రీట్ చేశా. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది. మేము అనుకున్న విజయం సాధించింది. భవిష్యత్ లో మరిన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వస్తాయని భావిస్తాను. శర్వానంద్ తో పని చేయడం ఎలా అనిపించింది ? శర్వానంద్ తో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమా నాకు, శర్వాకి ఇద్దరికీ ఒక ఎమోషనల్ రైడ్. శర్వాకి కూడా అమ్మ అంటే ప్రాణం. శర్వా లాంటి స్టార్ హీరో ఈ సినిమా చేయడమే పెద్ద సక్సెస్. శర్వాకి ఒక మంచి సినిమా, మంచి విజయం ఒకే ఒక జీవితం అవుతుందనినమ్మా. ఆ నమ్మకం నిజమైయింది. అమల గారిని తీసుకోవాలనే ఆలోచన ఎవరిది ? అమల గారిని తీసుకోవాలనే ఆలోచన నాదే. కథ విన్న తర్వాత అమల గారికి చాలా నచ్చింది. వెంటనే సినిమా చేస్తానని చెప్పారు. మీలో ఒక డ్యాన్సర్, నటుడు, దర్శకుడు, నిర్మాత వున్నారు కదా.. ఈ కోణాలు గురించి చెప్పండి ? ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నా. అదికాకపొతే న్యూయార్క్ స్కూల్ లో డ్యాన్స్ లో మాస్టర్స్ చేయాలనీ అనుకున్నా. ఇదే సమయంలో ఒక డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. రాధిక, గౌతమి గారు ఆ షోకి న్యాయ నిర్ణేతలు. నా ఎక్స్ ప్రెషన్, యాక్టింగ్ బావుందని మెచ్చుకున్నారు. నాలో ఒక నమ్మకం వచ్చింది. నటుడ్ని కావాలని చాలా తిరిగా. రెండేళ్ళు అవకాశాలు రాలేదు. తర్వాత నేనే రాయాలి నేనే తీయాలి అనే నిర్ణయానికి వచ్చాను. షార్ట్ ఫిలిమ్స్, యాడ్ ఫిలిమ్స్ చేశా. ఒకే ఒక జీవితానికి ఐదేళ్ళు పట్టిందని చెప్పారు కదా.. మరి షూటింగ్ ఎన్ని రోజులు తీసుకున్నారు ? షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాది పట్టింది. షూటింగ్ ని త్వరగానే పూర్తి చేశాం. రెండు భాషల్లో కలిపి 78 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశాం. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనుకోవచ్చా(నవ్వుతూ)…
వెర్సటైల్ హీరో నాగశౌర్య డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి' రెండు వారాల్లోపు థియేటర్ లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.…
Versatile star Naga Shaurya’s different rom-com Krishna Vrinda Vihari will arrive in cinemas in less than two weeks. Promotions are…