Sandeep Goyat

‘ఇన్ కార్’ ప్రెస్ మీట్ లో రితిక సింగ్

నేషనల్ అవార్డ్ విన్నర్,‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా, జ్ఞాన్ ప్రకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇన్ కార్’ మార్చి 3న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేట్రికల్‌ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో  రితిక సింగ్ మాట్లాడుతూ : ‘ఇన్ కార్’ చాలా సీరియస్, కంప్లీట్ రా ఫిల్మ్. ఈ సినిమా షూటింగ్ చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు హర్ష కు కృతజ్ఞతలు. చాలా భావోద్వేగానికి గురి చేసిన పాత్రది. చివరి క్షణం వరకూ పోరాడే పాత్ర చేశాను. కొన్ని సీన్లు చేస్తున్నపుడు టీం అంతా ఏడ్చేసేవారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. అందరికీ రీచ్ అవుతుందనే నమ్మకం వుంది. దురదృష్టవశాత్తు అత్యాచారంకు సంబంధించిన వార్తలు హెడ్ లైన్స్ లో రోజూ చూస్తుంటాం. ఎలాంటి పరిస్థితులు ఇలాంటి దారుణమైన సంఘటనలకు దారితీస్తాయనేది ఇందులో చూపించాం. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. ఈ కథ విన్నప్పుడే నటనకు ఆస్కారం వుండే పాత్ర చేయబోతున్నానని అర్ధమైయింది. దాదాపు షూటింగ్ కార్ లో చేశాం. ఈ కథకు కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వరకూ నేను తల స్నానం చేయలేదు. ‘ఇన్ కార్’ రియల్, డిస్టర్బింగ్ ఫిల్మ్. కానీ చివర్లో ఒక గొప్ప హోప్ ని ఇస్తుంది. అందరూ ‘ఇన్ కార్’ ని తప్పకుండా చూడాలి’’ అన్నారు. దర్శకుడు హర్ష వర్ధన్ మాట్లాడుతూ : ‘ఇన్ కార్’ ఒక థ్రిల్లర్. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. అత్యాచారంకు సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్ లో చూస్తుంటాం. అయితే ఆ వార్త హెడ్ లైన్స్ లోకి రావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు వుంటాయి? కొందరు ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారు? వాళ్ళ మనస్తత్వం ఎలా ఎలా వుంటుంది ? అనే అంశాలని చూపించాలానే ఆలోచనతో ఇన్ కార్ రూపొందించాం. ఇది చాలా క్లిష్టమైన సమస్య. శారీర హింసే కాదు మహిళలని మానసికంగా ఎలా హింసకు గురౌతుందో కూడా ఇందులో చూపించాం. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. రితిక సింగ్ అద్భుతంగా నటించారు. ఇది ఒక సవాల్ తో కూడుకున్న పాత్ర. ఈ సినిమా కోసం దాదాపు 32 రోజుల పాటు ఆమె తలస్నానం చేయకుండా ఒకే డ్రెస్ తో వున్నారు. చాలా అంకితభావంతో నటించారు. ఈ సినిమాతో తప్పకుండా ఆమెకు మరో జాతీయ అవార్డ్ వస్తుందనే నమ్మకం వుంది’’ అన్నారు.   తారాగణం: రితిక సింగ్, సందీప్ గోయత్, మనీష్ ఝంజోలియా,  జ్ఞాన్ ప్రకాష్ సాంకేతిక సిబ్బంది: ప్రొడక్షన్ హౌస్: ఇన్‌బాక్స్  పిక్చర్స్ నిర్మాతలు: అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి రచన, దర్శకత్వం: హర్ష వర్ధన్ డీవోపీ: మిథున్ గంగోపాధ్యాయ ఎడిటర్: మాణిక్ దివార్ యాక్షన్: సునీల్ రోడ్రిగ్స్

2 years ago

ఇన్ కార్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి, ‘గురు’ సినిమా ఫేమ్ రితిక సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ‘ఇన్ కార్‌’. ఇన్‌బాక్స్ పిక్చర్స్…

2 years ago