Manmadha, which was released in 2004 with Simbu and Jyotika as the hero and heroine, was re-released on October 5…
శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్…
మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్…
మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్…
కే టి కుంజుమన్ నిర్మాతగా, ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్సర్, యాక్టర్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు…
Amor Hospital Lifetime Privilege Card for Cine Music Artists * Free medical services in various super specialty departments for two…
యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్ తో కూడిన ‘లాఠీ’ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ''మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే.. అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్'' అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే తన కర్తవ్యం.. అతనికి కష్టాలను తెచ్చిపెడుతుంది. సునైనా విశాల్ భార్యగా నటించింది. ట్రైలర్ లో రొమాంటిక్ పార్ట్ కూడా చూపించారు. వీరికి 10 ఏళ్ల బాబు కూడా వున్నాడు. ట్రైలర్ సినిమాలోని అన్ని అంశాలను చూపించింది. అయితే యాక్షన్ పార్ట్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో భారీ స్టంట్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి. విశాల్ ఇంటెన్స్ రోల్ లో కనిపించగా.. సునైనా కూల్ క్యారెక్టర్ లో కనిపించింది. బాలసుబ్రమణియన్ వండర్ ఫుల్ ఫ్రేమ్‌లు, యువన్ శంకర్ రాజా అద్భుతమైన బిజియం ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 22న 'లాఠీ' అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తారాగణం: విశాల్, సునైనా సాంకేతిక విభాగం: దర్శకత్వం: ఎ వినోద్ కుమార్ నిర్మాతలు: రమణ, నంద బ్యానర్: రానా ప్రొడక్షన్స్ రచన: పొన్ పార్థిబన్ సంగీతం: యువన్ శంకర్ రాజా డీపీవో: బాలసుబ్రమణియన్ స్టంట్స్: పీటర్ హెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి పీఆర్వో: వంశీ-శేఖర్