నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ #Nani30 ఫస్ట్ లుక్, గ్లింప్స్ జూలై 13న విడుదల నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ మూవీ…
ARM: Teaser of Tovino Thomas starrer gets unveiled; actor gears up for his first pan India release Malayalam actor Tovino…
టోవినో థామస్ అజయంతే రందం మోషణం (ఎఆర్ఎం) టీజర్ లాంచ్.. మొదటి పాన్ ఇండియా విడుదలకు సిద్ధమౌతున్న టోవినో థామస్ తన సూపర్ హీరో మూవీ…
మాజీ ఉపరాష్ట్రపతిశ్రీ M.వెంకయ్యనాయుడు ముఖ్య అతిధి గా…జూన్ 11వ తేదీప్రముఖ సినీ దర్శకులు వి. మధుసూదనరావు శత జయంతి ఉత్సవం. తెలుగు సినిమా పుట్టడానికన్నా తొమ్మిది ఏళ్ల…
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచాయి. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ‘దసరా’ ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. దూమ్ ధామ్, ఓరి వారి, చమ్కీల అంగీలేసి పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు దసరా నుంచి నాలుగో సింగల్ ‘ఓ అమ్మలాలో’ పాటని విడుదల చేశారు మేకర్స్. ధరణి, వెన్నెల అందమైన బాల్యాన్ని చూపిస్తూ మనసుని హత్తుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంతోష్ నారాయణ్. ఈ పాటకు రెహమాన్ అందించిన సాహిత్యం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బాల్య మధుర స్మృతులని, మరపురాని జ్ఞాపకాలని ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని హార్ట్ టచ్చింగా ఆలపించారు. కీర్తి సురేష్ కథానాయిక నటించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించారు. ప్రతిభావంతులైన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమరామెన్ గా పని చేసిన ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటర్ . విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న దసరా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ReplyForward
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సందర్భంగా హీరో నేచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో దసరా బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు. దసరా విజయం ఎలా అనిపించిది ? సినిమా చూసిన వారంతా గొప్పగా స్పందిస్తున్నారు. విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మ్రోగుతూనే వుంది. మాట్లాడి చాలా కాలం అయిన వారు కూడా ఎమోషనల్ గా మెసేజ్ లు పెడుతుంటే.. దీని కోసమే సినిమా తీశాం కదా అనిపించిది. చాలా ఆనందంగా వుంది. దసరా లో చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్లు ఏవి ? దసరా లొకేషన్ లో ఎంజాయ్ చేస్తూ చేసిన సీన్ ఏదీ లేదు. అన్నీ చాలా కష్టపడి చేసిన సీన్లే. దుమ్ము, ధూళి, వేడి మధ్య పని చేశాం. అయితే బాగా వస్తున్నాయని ఫీలింగ్ మాత్రం అన్ని సీన్లకి వుంది. థియేటర్ లో ఎలా వుంటుందో అని ఎక్సయిటెడ్ గా అనిపించింది మాత్రం దసరా క్లైమాక్స్. ప్రేక్షకులతో కలసి థియేటర్ లో చూడటానికి చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచూసాం. ఆన్ లైన్ ఎడిటింగ్ చూసినప్పుడే మేము షాక్ అయ్యాం. మీరు కంప్లీట్ రీరికార్డింగ్ తో చూసేసరికి ఆ ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ కి పుష్ప.. మీకు దసరా అలా అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు.. ఈ సినిమా మీలో నటుడికి తృప్తిని ఇచ్చిందా? నటుడిగా నేను ఆనందపడతాను. కానీ తృప్తి పడను. ఎప్పుడు తృప్తి పొందుతామో ఇంకా ప్రయత్నం చేయడంలో అలసత్వం వచ్చేస్తుంది. ఈ సినిమాకే కాదు.. ఏ సినిమాకి తృప్తి పడను. ఆనందం మాత్రం వుంటుంది. దసరా తో టీం అందరికీ మంచి పేరు వచ్చింది. గ్రేట్ ఫీలింగ్. దసరా కథ విన్నప్పుడే దసరా కి ఇంత స్పాన్ వుందని అనుకున్నారా ? ఈ కథ విన్నప్పుడే ఇండస్ట్రీ లో బెస్ట్ టెక్నిషియన్స్ శ్రీకాంత్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సినిమా చేస్తున్నపుడే శ్రీకాంత్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పాను. విడుదలకు ముందే చాలా ఈవెంట్స్ లో శ్రీకాంత్ పేరు గుర్తుపెట్టుకోండని చెప్పాను. మిగతా భాషలల్లో తీసుకురావాలని ఎప్పుడు నిర్ణయించారు ? కథ విన్నప్పుడే. ప్రేమ స్నేహం పగ యూనివర్శల్ గా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్. మన కల్చర్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఏదైనా దొరికితే అది అందరి దగ్గరకి తీసుకెళ్లడం మన బాధ్యత. ఈ సినిమా చేస్తున్నపుడు బతుకమ్మ తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి కథ వచ్చినపుడు ఇది మా కల్చర్ చెప్పడం మన బాధ్యత. దినిని అక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాంతారతో భూత్ కొళా అనేది కర్ణాటకలో వుందని దేశంలో అందరికీ తెలిసింది. ఇలా మన కల్చర్ ని చెప్పే అవకాశం వచ్చినపుడు దానిని అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మాస్ రస్టిక్ సినిమాలు నడుస్తున్నాయి కదా.. ఇలాంటి సినిమా కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశారా ? నేను దేని కోసం ఎదురుచూడను. దసరా మాస్ సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా విడుదలకు ముందే దాని నుంచి బయటికి వచ్చేశాను. ఇప్పుడు ఆరేళ్ళ పాపకి తండ్రిగా ఓ సినిమా చేస్తున్న . నేను ఏ బ్రాకెట్ లో పడకూదని భావిస్తాను. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా సినిమాలు చేయలనేది నా ఆలోచన. జెర్సీ ఫ్యాన్స్ వున్నారు.. ఇప్పుడు దసరా ఫ్యాన్స్ వున్నారు.. వాళ్లకి సినిమా వుండాలి, వీళ్ళకి సినిమా వుండాలి. నటుడిగా ఈ వైవిధ్యం వుండాలి. దసరా కి నార్త్ నుంచి రెస్పాన్స్ ఎలా వుంది ? చాలా అద్భుతంగా వుంది. చాలా గొప్ప రివ్యూలు వచ్చాయి. చూసిన వారంతా ఈ ఏడాది మా ఫేవరేట్ ఫిల్మ్ దసరా అని చెబుతున్నారు. మేము ఊహించినదాని కంటే అక్కడ ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మేము ఊహించిన ఓపెనింగ్ వచ్చేసింది. దసరా కి వచ్చింది కొన్ని స్ట్రయిట్ హిందీ సినిమాలకి కూడా రాలేదు. రోజురోజుకి పెరుగుతోంది. మీ గత సినిమాల విజయాలకి మాస్ దసరా విజయానికి ఎలాంటి తేడా వుంది ? ఈ సినిమా విడుదలకు ముందు మీరు లవర్ బాయ్ కదా దసరా ఎలా వుంటుందని కొందరు అడిగారు. కానీ నా కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దసరా, ఎంసిఏ, నేను లోకల్. మూడు మాస్ సినిమాలు. నేను ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే వున్నాను. నేను ఏది జోనర్ వారిగా చూడను. నచ్చితే చేసేస్తాను. మీకు కంఫర్ట్ ఫుల్ జోనర్ ?…
With Dussehra, I will show you a mass that will touch your hearts. This is my promise. Nani is a…
In Dussehra, the role of moons was challenging. Vennela connects everyone: Keerthy Suresh
Satyam Vada Dharmam Chara movie press meet matter. Stills and video..Releasing on March 31
Natural Star Nani's Most Awaited Pan India Entertainer 'Dussehra' Has Grand Theatrical Release Worldwide on 30th March