Krithi Shetty

Teaser of Tovino Thomas starrer gets unveiled

ARM: Teaser of Tovino Thomas starrer gets unveiled; actor gears up for his first pan India release Malayalam actor Tovino…

2 years ago

ఏడు భారీ సెట్స్ లో పాట చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కస్టడీ’

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ' ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. లీడ్…

2 years ago

NC22 టైటిల్ ‘కస్టడీ’ఫస్ట్ లుక్ విడు దల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగుతమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది.NC22 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగానటిస్తోంది. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో NC22  ప్రాజెక్ట్ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈరోజు (అక్టోబర్ 23) నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ శుభకాంక్షలు తెలుపుతూ ...  అభిమానులు, సినీ ప్రేమికులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రానికి "కస్టడీ"అనే  పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేసారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్‌ లో కనిపించారు. నిజాయితీ, దృఢ నిశ్చయంతో ఉన్న పోలీస్ ఆఫీసర్ "ఎ. శివ" పాత్రలో, అతను చూడాలనుకునే మార్పు కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడతాడని పోస్టర్ చూస్తే అర్ధమౌతోంది. శివ తాను నమ్మే విధానం కోసం తన స్వంత వ్యవస్థతో పోరాటం చేస్తాడని ఫస్ట్ లుక్ లో స్పష్టమౌతోంది. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు, నాగ చైతన్యని పూర్తిగా కొత్త అవతార్‌ లో ప్రజంట్ చేశారు, వెంకట్ ప్రభు తన ప్రతి చిత్రానికి ప్రత్యేకమైన ట్యాగ్‌లైన్ ఇవ్వడంలో కూడా దిట్ట. 'కస్టడీ' కి 'ఎ వెంకట్ ప్రభు హంట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టారు. 'మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయి ఉండాలి' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, అత్యున్నత సాంకేతిక బృందం ప్రస్తుతం చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పించనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కతిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నటీనటులు: నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు సాంకేతిక  విభాగం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు నిర్మాత: శ్రీనివాస చిట్టూరి బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సమర్పణ: పవన్ కుమార్ సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్ ఎడిటర్: వెంకట్ రాజన్ డైలాగ్స్: అబ్బూరి రవి ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్…

2 years ago

నాగచైతన్య అందుకే అనౌన్స్ చేశారా

నాగచైతన్య ఇప్పుడు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నారు. ఏది స్టార్ట్ చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించనిదే అస్సలు చేయడం లేదు. ఆ మాటకొస్తే, కథల విషయంలో…

2 years ago

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సక్సెస్ మీట్

నెట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వచ్చిన చిత్రం''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.  సుధీర్ బాబుకు జోడిగా…

2 years ago