kiran abbavaram

మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్కావడం నా అదృష్టం: అతుల్యరవి

‘మీటర్’ లో మాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ తో పాటు బలమైన ఎమోషన్స్ వుంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో తెలుగులో లాంచ్ కావడం నా అదృష్టం: అతుల్య రవి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌ టైన్‌ మెంట్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన మీటర్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్‌ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అతుల్య రవి విలేఖరుల సమావేశంలో 'మీటర్'  విశేషాలని పంచుకున్నారు. 'మీటర్'తో తెలుగు పరిశ్రమలోకి రావడం ఎలా అనిపిస్తోంది ?  తెలుగు పరిశ్రమలోకి రావాలని బలంగా కోరుకున్నారు. దేవుడి దయ వలన  మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమాలో అవకాశం రావాడం చాలా ఆనందంగా వుంది. కథ చెప్పినప్పుడే చాలా నచ్చింది. అంతకుమందే కిరణ్ అబ్బవరం గారి ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా చూశాను. చాలా నచ్చింది. కథలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమిటి ? మీటర్ పక్కా కమర్షియల్ మూవీ. ఇందులో అద్భుతమైన ఎమోషన్స్ కూడా వున్నాయి. ఒక కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ వున్నపుడు అందరూ కనెక్ట్ అవుతారు. పాటలు కూడా చాలా బావుంటాయి. భారీ సెట్ లో ఒక సాంగ్ చేశాం. డ్యాన్సులు కూడా బావుంటాయి. మాస్ ఫైట్స్ రోమాన్స్ లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఫాదర్ సెంటిమెంట్ కీలకంగా వుంటుంది. తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు ? మీటర్ చేస్తున్నప్పుడే (నవ్వుతూ). సినిమాలు చూస్తూ.. టీంతో మాట్లాడుతున్నపుడు అలా వచ్చేసింది. ఇంకా చక్కగా నేర్చుకోవాలి. మీటర్ లో మీ పాత్రలో ఎలా వుంటుంది ? ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా వుంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాయి. నా పాత్ర సీరియస్ గా వుంటుంది. కానీ అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుంది. నా పాత్ర ఫస్ట్ హాఫ్ లో చాలా కామెడీ వుంటుంది. చమ్మక్ చమ్మక్ పోరి పాటలో డ్యాన్స్ చాలా బాగా చేశారు కదా ? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదు. అయితే డ్యాన్స్ అంటే చాలా ఆసక్తి. ఎవరైన నేర్పితే మాత్రం ఎలాంటి మూమెంట్స్ అయిన చాలా త్వరగా నేర్చుకుంటాను. ఈ పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా వుంటుందా ? లేదండీ. ఇది పూర్తిగా భిన్నం. ఇది మీకు కొత్త పరిశ్రమ కదా.. దీనికి అలవాటు పడటానికి ఎంత సమయం పట్టింది ? నాకు అలాంటి ఫీలే లేదండీ. కథ విన్నప్పుడే చాలా కంఫర్ట్ బుల్ అనిపించింది. లుక్ టెస్ట్ అయిన తర్వాత నేరుగా షూటింగ్ కి వెళ్ళాం. కిరణ్ గారు కూడా చాలా ఫ్రండ్లీ. తనలాగే నేను కూడా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ మూవీ చేసే వచ్చాను. ఆ కామన్ కనెక్షన్ మొదటి నుంచి వుంది. మేము ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుకుంటాం. ఇందులో కిరణ్ – మీ పాత్ర కెమిస్ట్రీ ఎలా వుంటుంది? కిరణ్ – నాకు వున్న కాంబినేషన్ సీన్స్ చాలా సరదాగా వుంటాయి. హీరోయిన్ ఫాలో చేసి టీజ్ చేయడం, ప్రేమించడం.. ఇలా హిలేరియస్ గా ఉంటుంది. మరో కోణంలో ఎమోషన్స్ ఫైట్స్ మాస్ వుంటుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ సినిమాని కిరణ్ అద్భుతంగా చేశారు. ఎమోషన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి.…

3 years ago

కిరణ్ అబ్బవరం ‘మీటర్’ మార్చి 29న ట్రైలర్ బ్లాస్టింగ్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్  ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి…

3 years ago

‘మీటర్’ సెకండ్ సింగిల్  ‘ఓ బేబీ’ ని  లాంచ్ చేసిన అనిల్ రావిపూడి

Blockbuster Maker Anil Ravipudi Launched The 2nd Single Oh Baby From Mythri Movie Makers Presents, Kiran Abbavaram, Ramesh Kaduri, Clap…

3 years ago

మార్చి 7న కిరణ్ అబ్బవరం మీటర్ టీజర్ విడుదల

MarchKiran Abbavaram meter teaser release on March 7, the film will hit the screens on April 7.

3 years ago

కిరణ్‌ అబ్బవరం హీరోగా ‘మీటర్‌’ ఏప్రిల్‌ 7న విడుదల!

'Meter' starring Kiran Abbavaram is releasing on April 7!Kiran Abbavaram is created a mark for himself as a hero by…

3 years ago

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా “వినరో భాగ్యము విష్ణుకథ”

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో…

3 years ago

Sammathame Trailer

https://www.youtube.com/watch?v=nW1aVe4uqtw Starring #KiranAbbavaram, #ChandiniChowdary Story-Screenplay-Dialogues-Direction: Gopinath Reddy Produced by Kankanala Praveena Music by Shekar Chandra DOP: Sateesh Reddy Masam Editor:…

3 years ago