G2

On Goodachari’s sixth anniversary, Adivi Sesh Reveals Six Stunning Moments

In a thrilling announcement for fans, acclaimed actor Adivi Sesh took to Twitter to celebrate the six-year anniversary of his…

5 months ago

అడివి శేష్  పాన్ ఇండియా మూవీ G2 ఫస్ట్ లుక్ & ప్రీ-విజన్ విడుదల

HIT2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు. “మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,  ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్  మేకోవర్‌ అయ్యారు. ప్రీ-విజన్ విషయానికి వస్తే,  శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా  G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్,  ప్రీ-విజన్‌ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. తారాగణం: అడివి శేష్ సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: వినయ్ కుమార్ సిరిగినీడి కథ: అడివి శేష్ నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పీఆర్వో: వంశీ-శేఖర్ మార్కెటింగ్: ఫస్ట్ షో

2 years ago