విజయ్ సేతుపతి, సూరి రెండు భాగాలుగా తెరకెక్కుతున్న “విడుతలై”!!

నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వాతియర్ గా, సూరి హీరోగా తెరకెక్కనున్న చిత్రం “విడుతలై”. ఆర్.ఏస్ ఇన్ఫో్టైన్మెంట్ మరియు రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై ఎల్డ్రడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.

మొదలు పెట్టినప్పటి నుండి అనూహ్యమైన స్పందన ని అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కడం దీనిని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై సమర్పించడంతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, “అద్భుతమైన నటీనటులు సాంకేతిక బృందం తో విడుతలై మొదటి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రెండో భాగంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలున్నాయి. ఖర్చు కి వెనకాడకుండా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ పరిశ్రమలో ఇప్పటివరకు తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. కళా దర్శకుడు జాకి నేతృత్వంలోని కళా బృందం 10 కోట్ల విలువ చేసే రైలు, రైలు బ్రిడ్జి సెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శించగా ఇటీవల సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యం లో భారీ సెట్ ని నిర్మించారు. ప్రస్తుతం యాక్షన్ కోరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో కోడైకనాల్  లో ఉత్కంఠభరితమైన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడు కి వచ్చిన నిష్ణాతులైన స్టంట్ బృందం పాల్గొనున్నారు.”

విజయ్ సేతుపతి, సూరి తో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు ఇతర అగ్ర తారలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

సంగీతం మేస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు ఇస్తుండగా సినిమాటోగ్రఫీ వెల్ రాజ్ చూస్కుంటున్నారు.

భారీ అంచనాల మధ్య తెలుగు – తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కుతున్న ‘విడుతలై పార్ట్ 1’ & ‘విడుతలై పార్ట్ 2’ విడుదల తేదీని నిర్మాతలు అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Tfja Team

Recent Posts

సమంత యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ విడుదల.. మే 15న మూవీ గ్రాండ్ రిలీజ్

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…

23 hours ago

‘లెనిన్‌’ నుంచి సెకండ్ సాంగ్ ‘ఎట్టా ఎట్టా’ రిలీజ్‌

యంగ్ అండ్ డైన‌మిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్‌’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు…

23 hours ago

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన “పళ్లిచట్టంబి” తెలుగులోనూ ఆ సక్సెస్ రిపీట్ చేస్తుంది – మూవీ ప్రొడ్యూసర్స్ చాణక్య, చైతన్య, చరణ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…

23 hours ago

‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్

గ‌త ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సైయారా’ కాంబో మ‌ళ్లీ మ‌న ముందుకు రావ‌టానికి స‌మాయ‌త్త‌మ‌వుతోంది. సైయారా అద్భుత విజయంతో…

2 days ago

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో‘అగధ’

ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…

2 days ago

మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి -ఎం.వెంకయ్య నాయుడు

అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…

2 days ago